శ్రీకాకుళం- ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మరోసారి సీఎం కాకుంటే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. శ్రీకాకుళం నగరంలో సిక్కోలు డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం, నరసన్నపేటలో ఇంటి హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ధర్మన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ‘‘జగన్ ను కాపాడుకునేందకు అవసరమైతే ప్రాణలిచ్చే నాయకులు, కార్యకర్తలతో పాలు రాష్టంలో సగం జనాభ అయిన మహిళలు, సచివాలయ వ్యవస్థ ఉంది. టీడీపీ తన హయాంలో చేసింది తక్కువ.. ఆర్భాటాలు ఎక్కువ. రాష్ట్ర రాజధాని గొప్పగా ఉంటే.. కొరుక్కు తింటామా’’ అంటూ విమర్శించారు. చంద్రబాబు అమరావతిని ప్రపంచలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామనడం హాస్యాస్పదమన్నారు. గొప్ప రాజధాని కన్నా.. రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలని గుర్తించి.. వాటిని పరిష్కరించడం ముఖ్యమన్నారు ధర్మాన. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.