నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన అన్ని స్థానాల్లో దాదాపు వైసీపీ హవానే కనిపించింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు గాను 54 వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దర్శి నగర పంచాయతీ మినహా ఎక్కడా కూడా టీజీపీ హవా కనిపించలేదు. కృష్ణా జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీలో 29 స్థానాల్లో 14 వైసీపీ, 14 టీడీపీ, 1 స్థానంలో ఇండిపెండెంట్ గెలిచాడు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయంపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు.
ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఉన్నాయన్నారు. ‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు… ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. నెల్లూరు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు… ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2021