ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై కొందరు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం.. నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా కొందరు పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇక నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు అంశంమై ప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆనం తీరు ఇలా ఉంటే.. ఇదే జిల్లాకు చెందిన మరో నేత వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది.
నెల రోజుల క్రితం వరకు కూడా ఆయన కనీసం రోజుకు ఒక్కసారైనా మీడియా ముందుకు వచ్చేవారు. విపక్షంపై ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. అలాంటి నేత అనూహ్యంగా గత కొన్ని రోజుల నుంచి మౌనంగా మారిపోయారు. నాలుగు రోజుల క్రితం విపక్ష నేత ఒకరు నెల్లూరులో పర్యటించి.. బహిరంగ సవాలు విసిరినప్పటికి.. ఆయన మౌనంగానే ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకు ఎవరా మంత్రి.. ఆయన మౌనం వెనక గల కారణాలు తెలియాలంటే.. ఇది చదవండి..
ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల బరిలో నారా బ్రహ్మణి! పోటీ ఖాయమా?
నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. నీటి పారుదల శాఖ మంత్రిగా జగన్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఇక విపక్ష నేతలు చేసే విమర్శలు తిప్పి కొట్టడంలో, వారిపై అదే స్థాయిలో విరుచుకుపడటంలో ముందుంటారు అనిల్ యాదవ్. అయితే అనూహ్యంగా గత కొన్ని రోజులు నుంచి ఆయన సెలైంట్ అయ్యారు. జిల్లాలో ఏవైనా కార్యక్రమాలు జరిగినా.. రావడం, హాజరవడం, వెళ్లిపోవడం అంతే అన్నట్లుగా ఉంటున్నారు తప్పితే.. పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు.
దేవినేని ఉమా చాలెంజ్ పై కూడా మౌనమే..
ఇక టీడీపీ నేతలు ఏ విషయంలోనైనా సరే విమర్శలు చేస్తే.. వాటిని తిప్పికొట్టడంలో అనిల్ కుమార్ ముందుంటారని అందరికి తెలిసిన సంగతే. కానీ నాలుగు రోజుల క్రితం జిల్లాలో జరిగిన సంఘటన చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారట. అనిల్ కి ఏమైందబ్బా అని చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా నెల్లూరులో పర్యటించారు. పెన్నా నది వంతెన వద్ద సీఎం జగన్, మంత్రి అనిల్ కుమార్ కు సవాల్ విసిరారు దేవినేని. టీడీపీ హయాంలో 67 వేల కోట్ల రూపాయలతో నీటి పారుదల పనులు చేశామని.. ఈ 30 నెలల్లో మీరేం చేశారో చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. హమీలు నిలుపుకోలకపోయిన నీకు ఏ డ్రెస్ కావాలో చెప్పు పంపిస్తానంటూ దేవినేని ఉమా.. అనిల్ కి బహిరంగ సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి : టీడీపీలో ఊహించని మలుపు! రంగంలోకి బ్రహ్మణి!
దేవినేని సవాల్ కి అనిల్ కూడా రియాక్ట్ అవుతారని.. అదే స్థాయిలో రిప్లై ఇస్తారని అందరూ భావించారు. మరోసారి జిల్లాలో రాజకీయ విమర్శలతో మోత మోగిపోతుందని భావించారు. అయితే అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ.. దేవినేని ఉమా సవాలుపై అనిల్ యాదవ్ కనీసం స్పందించలేదు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు
అనిల్ మౌనానికి కారణం అదే..
మంత్రి అనిల్ దూకుడికి చెక్ పెట్టింది సీఎం జగన్ అనే అంటున్నాయి పార్టీ శ్రేణలు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో అనిల్ ఔట్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రులందరికి జగన్ ఫేర్‌వెల్ విషయం ఇప్పటికే చెప్పారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాక కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు.. జిల్లాకో మంత్రిని ఇంఛార్జీగా నియమించాలని సీఎం భావిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా అనిల్ మంత్రి పదవి పోవడం గ్యారెంటీ అనే విషయం ఆయనకు తెలిసిందని.. అందుకే ఆయన మౌనంగా ఉన్నారని సన్నిహితులు తెలుపుతున్నారు.
మరీ ముఖ్యంగా తనను మంత్రి పదవి నుంచి తొలగించి.. ఆ స్థానంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారనే వార్తలు అనిల్ కు మింగుడుపడటం లేదట. అధిష్టానం నిర్ణయం కావడంతో.. ఏమనలేక మౌనంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే కాకాణికి బెర్త్ కన్ఫామ్ అయినట్లు వైసీపీ నేతలు ముచ్చటించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత తన మంత్రి పదవి పోవడం ఖాయమని తెలియడంతోనే.. అనిల్ సైలెంట్ అయిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ వాగ్దాటికి సీఎం జగన్ కళ్లెం వేశారని అంటున్నారు విపక్ష నేతలు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.