ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ.. వైసీపీలో చిచ్చు పెట్టింది. మరోసారి, కొత్తగా మంత్రి పదవి దక్కిన వారు ఫుల్లు ఖుషిగా ఉండగా.. పదవి కోల్పోయిన పాత మంత్రుల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతేకాక పాత మంత్రుల్లో ఒకరిద్దరి అనుచరులు ఆందోళనలకు దిగగా.. పదవి ఆశించినా.. దక్కనివారి అనుచరులు రోడ్డెక్కారు. ఇక రెండోసారి మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గుర్రుగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: మంత్రి పదవికి అంబటి రాంబాబు రాజీనామా! ఇదెక్కడి కామెడీ స్వామి?
పాత మంత్రివర్గంలో ఐదుగురు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉంటే నలుగుర్ని కొనసాగిస్తూ సుచరితను తొలగించడం ఏంటని అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే గుంటూరులోని ఆమె నివాసానికి భారీగా అనుచరులు తరలివచ్చారు. ఆమెను మంత్రివర్గంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సుచరితను బుజ్జగించడానికి ఎంపీ మోపిదేవి వెంకట రమణ రంగంలోకి దిగారు.. ఆమె ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: మీతో ఇదే నా చివరి సమావేశం.. పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు!
సుచరితతో చర్చల అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి ఒక్కటే న్యాయం కాదని.. కొన్నిచోట్ల చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయన్నారు. వీలైనంత త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయని.. తమదంతా ఉమ్మడి కుటుంబమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మేకతోటి సుచరిత కుమార్తె రిషిక తెలిపారు. రాజీనామా లేఖను ఎంపీ మోపిదేవికి ఇచ్చామని.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పలేదని సుచరిత కుమార్తె మీడియాతో తెలిపింది.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ కేబినెట్ లో కొత్త మంత్రులు వీరే!
ఇక సుచరితతో పాటు మరోసారి మంత్రి పదవి దక్కనందుకు.. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు అధిష్టానం పార్టీ సీనియర్లను రంగంలోకి దించింది. బాలినేనిని బుజ్జగించేందుకు పార్టీ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆయన నివాసానికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఒకసారి బాలినేని ఇంటికి వెళ్లి చర్చించిన సజ్జల.. రాత్రి మరోసారి వెళ్లి చర్చలు జరిపారు. మరి అసంతృప్త నేతలు అధిష్టానం మాట వింటారో.. లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.