ఏపీలో అధికార వైసీపీ మరోసారి పవర్ లోకి వచ్చేందుకు ప్రణాళిలను సిద్ధం చేస్తుంది. అందులోభాగంగానే ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, రీజనల్ కోర్డినేటర్లు, పార్టీ సమన్వయకర్తలతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే గతంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కంటే.. సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్ స్వరం మార్చారు.
ఏపీలో అధికార వైసీపీ మరోసారి పవర్ లోకి వచ్చేందుకు ప్రణాళిలను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, రీజనల్ కోర్డినేటర్లు, పార్టీ సమన్వయకర్తలతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమంపై తరచూ సమీక్ష సమావేశం నిర్వహించే వాడు. ఇలా నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనితీరు సరిగ్గాలేని ఎమ్మెల్యేలకు సీఎం హెచ్చరిలు జారీ చేసేవారు. అయితే నేడు నిర్వహించిన వైసీపీ అంతర్గత సమావేశంలో సీఎం స్వరం మార్చి.. అందరూ తనవాళ్లు అనేలా ప్రసంగించారు.
ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పటిష్ట ప్రణాళికు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తుంటారు. అలానే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అలానే ఈకార్యక్రమంపై తరచూ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించే వారు. అయితే ఆ సమయంలో పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకూడదంటూ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పాడు.
తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు పాల్గొన్న సమావేశంలో సీఎం జగన్ స్వరం మార్చారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోను, ఏ ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అని తాను అనుకోనంటూ జగన్ స్పష్టం చేశారు. ఇలా సోమవారం పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎంతో ప్రేమగా జగన్ మాట్లాడారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు.
రాబోయే కాలంలో ఇలాంటి అసత్యాలు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. మీతో పనిచేయించి, మీమ్మల్ని గెలిపించాలనే ఈ కార్యక్రమాలు ప్రారంభించానని ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గా లేకపోతే పార్టీకి, కేడర్ కి నష్టమని, అలానే మనం అధికారంలో లేకపోతే ప్రజలు నష్టపోతారంటూ సీఎంతో ఎంతో ఎమోషనల్ గా ప్రసంగించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావంతోనే జగన్ స్వరం మారిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఈ సమావేశంలో జగన్ మాట్లాడిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.