ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాలను పక్కనే పెడితే.. ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల గురించి ఏపీలో చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికి తాజాగా మరోసారి ఆ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాలను పక్కనే పెడితే.. ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల గురించి ఏపీలో చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికి తాజాగా మరోసారి ఆ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలే కారణమని రాజకీయ విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు. ముందస్తు ఎన్నికల వెళ్లే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి.. ముందస్తు ఎన్నికలు రానున్నట్లు వినిపిస్తోన్న వార్తలకు అసలు కారణం ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే ముందస్తు ఎన్నికల వార్తల ప్రధాన కారణమని చాలా మంది భావిస్తున్నారు. ఇటీవలే జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల ఇచ్చిన విజయంతో టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనూ పోటీ చేసింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే కోటా ఎన్నికలను వైసీపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడు స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఏడు స్థానాల్లో తామే విజయం సాధిస్తామని అధికార వైసీపీ పార్టీ ధీమ వ్యక్తం చేసింది. అయితే అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.
ఆమె విజయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు కీలక పాత్ర పోషించారు. అధిష్టానాన్ని ధిక్కరించి.. క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో అనురాధ అద్భుత విజయం సాధించింది. వైసీపీ అధిష్టానం క్రాస్ ఓటింగ్ వేశారనే ఆరోపణలో తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ ఫలితాల తరువాత ఏపీ రాజకీయ వాతావరణం పుల్ హీటెక్కింది. సీఎం జగన్ పై ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉందనటానికి ఈ ఫలితాలే నిదర్శనమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలే కాకుండ ఇంకా చాలా మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వారి ఆరోపణలు తగినట్లే వైసీపీలోని చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా ప్రజల్లోతమకు తగిన గౌరవం లేదని ఎమ్మెల్యేలు ఆవేదనతో ఉన్నట్లు కొందరు అంటున్నారు. అవకాశం వస్తే సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లేందుకు కూడా వెనుకాడని విధంగా ఎమ్మెల్యేలు ఉన్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ కూడా తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటుంది. ఇలాంటి తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్ వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అసంతృప్త ఎమ్మెల్యే సంఖ్య పెరగక ముందే.. ఎన్నికలకు వెళ్లాని అధికార పార్టీ భావిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అలానే ఇటీవలే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీడీపీ పూర్తి స్థాయిలో బలపడక ముందే ఎన్నికలకు వెళ్తే..మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ భావిస్తున్నట్లు కొందరు అంటున్నారు. ఇక ముందస్తు ఎన్నికలు విషయంపై నెలరోజ్లులో సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నట్లు వినిపిస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.