బుల్లితెర యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన యాంకరింగ్ తో తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించింది. అయితే తాాజాగా ఓ ఫోటో విషయంలో నెటినజ్లు ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
బుల్లితెర యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన యాంకరింగ్ తో తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించింది. వివిధ రకాల షోల్లో యాంకరింగ్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. బుల్లితెరపైనే కాక వెండితెరపై కూడా శ్యామల మెరిశారు. ఇలా బిజీగా ఉండే ఆమె సోషల్ మీడియలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శ్యామలకు సంబంధించిన ఓ ఫోటోపై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మరి.. ఈ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అందం, అభినయం కలగలిసిన శ్యామల.. అతి చిన్న వయస్సులోనే బుల్లితెరలో అడుగు పెట్టారు. తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్న శ్యామల.. టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఆమె బుల్లితెరపై షోలతో పాటు పలు ఈ వెంట్స్ లు సైతం చేస్తుంది. ఇలా బుల్లితెరపై క్రేజ్ సంపాదించిన శ్యామల.. సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపై కూడా మెరిసింది. పలు చిత్రాల్లో నటించి.. మంచి గుర్తింపు పొందారు. ఇటీవలే విరూపాక్ష సినిమా లో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. ఇక శ్యామల మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరచూ వారిద్దరు వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారు. షూటింగ్స్ తో బిజీ బిజీగానే ఉంటూ సోషల్ మీడియాలో సైతం శ్యామల యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా ఆమె.. తన భర్తతో కలిసి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కడువ కప్పుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన వారిలో కొందరు ఆమె అందాన్ని పొగుడుతూ ఉండగా మరికొంతమంది ఆమె రాజకీయం ఎంట్రీ గురించి చర్చలు చేస్తూ కనిపించారు. అంతేకాక శ్యామలపై కొందరు భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. “ఏపీకి ప్రత్యేక హోదా ఎక్కడ అక్క. ఎన్నిక సమయంలో వైసీపీ జెండా పట్టుకొని తిరిగావు” అంటూ కామెంట్స్ చేశారు. డబ్బులు ఇస్తే కెఏ పాల్ పార్టీ జెండా పట్టుకొని కూడా తిరుగుతారు వీళ్ళు అంటూ మరికొందరు దారుణంగా ట్రోల్ చేశారు. ఇక కామెంట్స్ పై శ్యామల ఫ్యాన్స్ బాగా ఫైర్ అవుతున్నారు. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ శ్యామల ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.