ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్‌ఇండియా స్టార్‌గా, వరల్డ్ వైడ్ స్టార్‌గా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఆయనతో కలిసి డిన్నర్ చేసిన అమిత్ షా చాలా సేపు ముచ్చటించారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూసి ఇంప్రెస్ అయిన అమిత్ షా.. ఎన్టీఆర్‌ను కలవాలనుందని తన కోరికను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమిత్ షా, పనిలో పనిగా ఎన్టీఆర్‌ను కలిశారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఎన్టీఆర్, అమిత్ షా కాసేపు ముచ్చటించారు. వీరిద్దరి భేటీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో రాజకీయపరమైన చర్చలు అయి ఉండవచ్చునని రాజకీయ వర్గాల్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ భేటీ కేవలం ఎన్టీఆర్‌ను ప్రశంసించడానికే అని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఇక ఎన్టీఆర్‌ను కలిసిన ఆనంద క్షణాలను అమిత్ షా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. “అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది” అని ట్వీట్ చేశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ రీట్వీట్ చేస్తూ.. “మిమ్మల్ని కలుసుకోవడం, మీతో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మీ మాటలకు కృతజ్ఞతలు అమిత్ షా జీ” అని రాసుకొచ్చారు. మరి ఎన్టీఆర్, అమిత్ షాల భేటీపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
It was a pleasure meeting you and having a delightful interaction @AmitShah ji. Thanks for the kind words. https://t.co/Hrn33EuRJh
— Jr NTR (@tarak9999) August 21, 2022