ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులపై లైంగిక వేధింపు ఆరోపణలు ఎక్కువయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవలే జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.రాజయ్యపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకలుపై లైంగిక వేధింపు ఆరోపణలు ఎక్కువయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవలే జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.రాజయ్యపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. తనను లైంగిక వేధిస్తున్నాడంటూ ఓ మహిళ సర్పంచ్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది మరుకముందే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ యువతి ఆరోపణలు చేసింది. తనను నమ్మించి మోసం చేశాడని ఆ యువతి చెప్పింది.
ఓ ప్రైవేట్ డైయిరీ సంస్థ సీఈవో అయిన ఓ యువతి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఏర్పాటు చేసిన కంపెనీ విస్తరణకు ఎమ్మెల్యే సాయం చేస్తాని చెప్పారని ఆమె తెలిపారు. అలానే బెల్లంపల్లిలో డెయిరీ సంస్థ ఏర్పాటు కోసం స్థలం ఇచ్చి సహకరిస్తానని తమ దగ్గర నుంచి ఎమ్మెల్యే రూ.20 లక్షలు డబ్బులు అడ్వాన్స్ గా తీసుకున్నారని తెలిపింది. వ్యాపార విషయాల గురించి ఎమ్మెల్యేను కలవడానికి హైదరాబాద్ వెళ్లే వాళ్లమని ఆమె చెప్పింది.
ఈ క్రమంలో తమతో పాటు తమ కంపెనీలో పని చేసే అమ్మాయిని తీసుకెళ్లామని తెలిపింది. ఆ అమ్మాయిని తన వద్దకు పంపాలని ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని ఆమె ఆరోపించారు. అందుకు తాము అంగీకరించలేదని, ఆ కోపంతో హామీ ఇచ్చినట్లుగా ప్లాంట్ ఏర్పాటు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించకపోగా.. తమపైనే తప్పుడు కేసులు పెట్టించారని తెలిపింది. అంతేకాక అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువతి వీడియోను సైతం విడుదల చేశారు. రకరకాలుగా తమను వేధించారని ఆమె తన బాధను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చేసిన మోసాలను బట్టబయలు చేస్తామని ఆ యువతి తెలిపారు. ఎమ్మెల్యేను తాము బ్లాక్ మెయిల్ చేస్తున్నామని ఆయన చెప్పే మాటలు అబద్దమన్నారు.
ఎమ్మెల్యే తప్పుడు కేసులతో తనను అరెస్టు చేయించారని, కానీ పోలీసులు మాత్రం తాము పట్టుకున్నామని చెబుతున్నారని యువతి తెలిపారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన విషయాల్లో అసలు నిజాలు తెలియాలంటే ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్న సీసీ పుటేజీ బయటపెట్టాని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె తెలిపారు. తమకు పోలీసులు రక్షణ కల్పించాలని, అలానే సమగ్రహమైన విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఓ యువతి వాయిస్ గా చెబుతున్న ఆడియో రికార్డు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువతి ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు.