ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజుల నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ సినీ సమస్య పరిష్కారానికి గాను చిరంజీవితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖలు సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ తరపున వెళ్లిన వారిలో అలీ కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అయితే తను మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉండటంతోనే భేటీకి ఆహ్వానం అందిందనే వార్తలు వినిపించాయి. అదే రోజు సీఎం జగన్ వారం రోజుల తర్వాత మళ్లీ కలుద్దాం అని అలీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అలీని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమించారు. మరి.. అలీని ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.