చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు గట్టి పోటీ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ నగరి నుంచి ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంగా బుధవారం వాణీ విశ్వనాథ్ నగరి నియోజకవర్గంలో పర్యటించారు. నగరి నియోజకవర్గంలో తనకి వేలాది మంది అభిమానులు ఉన్నారని వారి కోరిక మేరకే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
పర్యటన తర్వాత వాణీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు.. ‘ఫలానా పార్టీ నుంచి పోటీ చేయాలని ఇంకా నిర్ణయించుకోలేదు. నగరి నియోజకవర్గం నుంచి అయిచే కచ్చితంగా పోటీ చేస్తాను. నగరిలో మా అమ్మమ్మ నర్సుగా సేవలందించారు. ఈ ప్రాంతవాసులకు నేను సుపరిచితమే. నగరిలో తమిళ సంస్కృతి ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తాను. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధమే. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తాను.‘మా మేనేజర్ రామానుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేకనే రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. నలుగురికి సహాయం చేసే అలాంటి వ్యక్తే ఇంబ్బందుల పాలైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటనే ఆందోళన కలిగింది. అందుకే నగరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా’ అంటూ వాణీ విశ్వనాథ్ తెలిపారు. నగరి అంటే రోజా.. రోజా అంటే నగరి అనేలా మారిన పరిస్థితులను అధిగమించి వాణీ విశ్వనాథ్ విజయం సాధించగలరా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.