ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. ఈయనను విమర్శించే వారు కొందరైతే, దేవుడిలా పూజించే వారు మరికొందరు ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా టాలీవుడు నటుడు జగపతి బాబు కూడా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే కాదు ఏపీ రాజకీయాల్లో మారుమోగిపోతుంది. సినిమాలో నటించి అందరి మదిలో పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ నిలిచారు. అలానే ప్రస్తుతం రాజకీయాల్లో కూడా తనదైమ ముద్ర వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2024లో ఏపీ జరగనున్న ఎన్నికల్లో సత్తాచాటేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను పరిశీలించినట్లయితే ప్రధాన యుద్ధం వైసీపీ, జనసేన మధ్య ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో సినీ రాజకీయ రంగాలకు చెందిన వారు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, పట్టుదల గురించి ఆసక్తికర విషయాలు చెప్తుంటారు. తాజాగా టాలీవుడ్ నటుడు జగపతిబాబు పవన్ కళ్యాణ్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న నటుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని జగపతి బాబు అన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా శోభన్ బాబు తర్వాత నటుడు జగపతి బాబు కి మాత్రమే ఆ పేరు దక్కిందని చెప్పొచ్చు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ జగపతి బాబు తండ్రి. ఆయన తన కొడుకు జగపతిబాబును 1989లో “సింహస్వప్నం” చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ సినిమా అనుకున్నంతగా విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వాత జగన్నాటకం, పెద్దరికం లాంటి చిత్రాలు జగపతిబాబు కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇండస్ట్రీలో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన జగపతి బాబుకు జీవితం పూలబాటగా ఏమి సాగలేదు. ఆయన కూడా జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు అనుభవించారు. జగపతి బాబు మొదట్లో మాస్ హీరోగా ప్రయత్నించి.. చివరకు ఫ్యామిలీ హీరోగా అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంత కాలం జగపతి బాబు నటించిన చిత్రాలకు మంచి ఆదరణ లభించినా.. 2010 నుంచి ఆయనకు వరుస అపజయాలతో సతమతమయ్యాడు.
2014 లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ మూవీ జగపతి బాబు జాతకాన్నే మార్చివేసింది. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబుకు ఈ చిత్రంతో పవర్ ఫుల్ విలన్ మారిపోయారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో జగపతి బాబు నటిస్తూ బిజీ మారిపోయారు. మొత్తానికి జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా సాగుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వ్యక్తిగత, సినీ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయలోకి వెళ్లిన నటుల్లో పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని జగపతి బాబు తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..” నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రాజకీయలతో సంబంధం ఉన్న నటుల్లో పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం. అయితే నాకు నచ్చిన హీరో అని కాకుండా రాజకీయాల్లోకి వెళ్లిన నటుల్లో ఇష్టమైన వ్యక్తి అంటే పవన్ కల్యాణ్. అలానే నాకు ఇష్టమైన హీరోయిన్ సౌందర్య, విలన్ పాత్రలో నటించిన హీరోయిన్ల రమ్యకృష్ణ అంటే ఇష్టం. ఇక నా ఆహారం విషయానికి వస్తే.. నాకు ఇష్టమైన ఆహారం పప్పు చారు. నేను పక్క నాటు మనిషి. పప్పుచారుతో ఆహారాన్ని ఓ రేంజ్ లో లాగిస్తాను. ఇష్టమైన పాటల విషయానికి వస్తే.. పెద్దరికం సినిమాలో ‘ప్రియతమా!’ అనే సాంగ్ ఇష్టం’ అని జగపతి బాబు తెలిపారు. మరి.. పవన్ కళ్యాణ్ పై జగపతి బాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.