నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ ఇలా అన్నింటా బాలకృష్ణకు బాలకృష్ణతోనే పోటీ అనేట్టుగా ఉంటుంది. అటు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. హిందూపురం నుంచి బాలకృష్ణ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను, మీ సమస్యలను సత్వరం పరిష్కరిస్తాను అంటూ బాలకృష్ణ ఎప్పుడూ చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యల మీదే ప్రధానంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మా ఎమ్మెల్యే మాకు కనిపించడం లేదంటూ కొందరు హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అటు సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ నియోజకవర్గ సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదు. మాకు అందుబాటులో లేరంటూ ఆరోపిస్తూ కొందరు హిజ్రాలు ఫిర్యాదు చేశారు. మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు అసలు కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా విధులు నిర్వహించాల్సిన బాలకృష్ణ ఇక్కడ లేరు. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలంటూ హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే హిందూపురంలోని సమస్యలను పట్టించుకుని వాటికి పరిష్కార మార్గాలు వెతకాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాగైనా తమ సమస్యలకు పరిష్కారాలు దొరికేలా పోలీసులు కృషి చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యపై ఫిర్యాదు అంశం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
బాలకృష్ణపై హిజ్రాలు ఫిర్యాదు చేయడాన్ని అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు తప్పుబడుతున్నారు. అసలు అలా ఫిర్యాదు చేయడంపై బాలయ్య ఫాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగాను బాలకృష్ణ విశేష సేవలు అందిస్తున్నారని.. కావాలనే కొందరు కావాలని బాలకృష్ణ పేరును చెడగొట్టేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కొందరు కక్షపూరితంగా ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారంటూ హిందూపురం టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. కావాలనే ఇలాంటి ఫిర్యాదులతో బాలకృష్ణపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన హిందూపురంలో ఉన్నా లేకున్నా ఎవరికీ ఎలాంటి లోటు రాదని చెబుతున్నారు.