ఇటీవల కాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయంటే.. ఆ వెంటనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల నుండి అప్ కమింగ్ హీరోల వరకూ ఎవరి సినిమాలైనా ప్లాప్ టాక్ వస్తే అంతే. సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు మినిమమ్ నాలుగు వారాల నుండి ఎనిమిది వారాల ఓటిటిలో రిలీజ్ అవుతాయని సినీ నిర్మాతల కమిటీ నిర్ణయించింది. అయితే.. సినిమాలు థియేటర్లలో కాస్తో కూస్తో ఆడితే అలాంటి అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు.
అదే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపకపోయేసరికి రెండు వారాల్లో కూడా ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఇదే బాటలో చేరింది ‘వాంటెడ్ పండుగాడ్‘ మూవీ. సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి జంటగా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, సప్తగిరి, వెన్నెల కిషోర్, నిత్యాశెట్టి, యాంకర్ విష్ణుప్రియ కీలకపాత్రలో నటించారు. అయితే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమాను శ్రీధర్ సీపాన తెరకెక్కించారు.
ఇక కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమాలో బుల్లితెరపై ఫేమస్ అయిన సుధీర్, దీపికా, అనసూయ, విష్ణుప్రియ లాంటివాళ్లు ఉండేసరికి ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను తెలుగు ఓటిటి ఆహా వారు సొంతం చేసుకున్నారు. మొత్తంగా వాంటెడ్ పండుగాడ్ మూవీ.. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించింది. మరి వాంటెడ్ పండుగాడ్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Jail nunchi thappinchukunna most wanted criminal Pandu. How did criminal turn from pandu to ‘panduGod’?🤔
Watch #WantedPanduGodOnAHA premieres September 2.@UnitedKProdctns @Ragavendraraoba@Mee_Sunil #Brahmanandham @sudheeranand @IamSaptagiri @vennelakishore @Actorysr pic.twitter.com/8yKJh151lJ— ahavideoin (@ahavideoIN) August 29, 2022