సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది ఈ సినిమా. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నాడు వీరయ్య. డ్యాన్స్, యాక్షన్, కామెడీ, చిరు-రవితేజ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. కొత్త ఏడాదిలో.. అందునా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చి.. మాస్ హిట్ కొట్టాడు చిరంజీవి. చిరు వింటేజ్ వైజ్.. డ్యాన్స్‌లో గ్రేస్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మేకర్స్‌పై బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటించగా.. రవితేజ ఓ కీలక పాత్రలో నటించాడు. పూనకాలు లోడింగ్ అంటూ.. బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర కొనసాగిస్తున్నాడు వీరయ్య.
ఇక ప్రస్తుత కాలంలో థియేటర్‌లో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలానే వాల్తేరు వీరయ్య ఓటీటీ పార్టనర్ లాక్ అయినట్లు అప్పుడే వార్తలు వెలువడుతున్నాయి. దీని ప్రకారం.. ‘వాల్తేర్ వీరయ్య’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు.. మూవీ స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇంకా డిసైడ్ కాలేదు. ఒకవేళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ లభిస్తే.. దాదాపు ఆరు వారాల వరకు వాల్తేరు వీరయ్య ప్రీమియర్ కాకపోవచ్చు. కానీ తాత్కాలిక విడుదల తేదీ విషయానికొస్తే.. ఫిబ్రవరి చివరలో ఉండవచ్చు అంటున్నారు.
ఇక వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ విషయానికొస్తే.. స్టార్ హీరోలతో ‘పవర్, జై లవకుశ, సర్ధార గబ్బర్ సింగ్, వెంకీ మామ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ క్రమంలో ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు బాబీ. ఒక రియల్ ఫ్యాన్‌గా మెగాస్టార్‌ను ఎలాగైతే చూడాలనుకుంటున్నాడో అదేవిధంగా చూపించే ప్రయత్నం చేశానని, దానికి మంచి కథ కూడా తోడయ్యిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు బాబీ. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతంలో కనిపించింది.