కన్నడ హీరో కిచ్చా సుదీప్ గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ అయినప్పటికీ, ఈగ సినిమాతో తెలుగులో కూడా మంచి క్రేజ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో ఈగ సినిమా తర్వాత సుదీప్.. బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాలతో పాటు తన డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుదీప్ కి తెలుగులో ఇంత క్రేజ్ రావడానికి కారణం ఈగ సినిమానే అని చెప్పాలి.
ఇక సుదీప్ ఓవైపు హీరోగా చేస్తూనే.. ఇతర భాషల సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ముఖ్యంగా సుదీప్ వాయిస్, బాడీ లాంగ్వేజ్ కి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఏర్పడింది. ఇటీవలే సుదీప్ ‘విక్రాంత్ రోణ’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి.. రూ. 200 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమాను అనూప్ భండారి రూపొందించారు.
ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు కొద్దిరోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రిలీజైన నాలుగు వారాలకు విక్రాంత్ రోణ.. ఓటిటి రిలీజ్ కి రెడీ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత సుదీప్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. ఇక సెప్టెంబర్ 2 నుండి విక్రాంత్ రోణ.. జీ5లో స్ట్రీమింగ్ కాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. మరి థియేటర్లలో మిస్ అయిన వారికి ఓటిటిలో ఈ సినిమా ట్రీట్ అనే చెప్పాలి. మరి విక్రాంత్ రోణ ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#VikrantRona pic.twitter.com/cvdGxUORKg
— Aakashavaani (@TheAakashavaani) August 25, 2022