ఇసయ దళపతి విజయ్ నటించిన వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రిలీజైన(జనవరి 11) దాదాపు నెల రోజులకే ఓటిటిలోకి వస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో వస్తున్నాయంటే ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్స్ లో ఓ ఊపు ఊపేశాక.. అదే సినిమా ఓటిటిలోకి వస్తోందంటే కూడా చూసేందుకు ఫ్యాన్స్ రెడీగానే ఉంటారు. ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన ‘వారసుడు'(తమిళంలో వారిసు) విషయంలో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.
ఇక ఫ్యామిలీ డ్రామా జానర్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన వారసుడు మూవీ.. బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం విజయ్ లుక్స్, సాంగ్స్, రష్మిక గ్లామర్ మాత్రమే సినిమాకి ప్లస్ అని కథనాలు వినిపించాయి. కానీ.. టాక్ కి భిన్నంగా సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూల్ చేసినట్లు చిత్రబృందం ఇదివరకే పోస్టర్స్ రిలీజ్ చేసింది. అయితే.. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, విజయ్ ఫ్యాన్స్ మాత్రం అజిత్ సినిమాకి పోటీగా దిగినందుకు సంతోషించారు. మొత్తానికి విజయ్ సినిమాతో పాటు అజిత్ నటించిన తెగింపు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టడంతో వారసుడు సినిమా ఓటిటి రిలీజ్ గురించి వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వారసుడు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 22 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. థియేట్రికల్ రిలీజైన(జనవరి 11) దాదాపు నెల రోజులకే ఓటిటిలోకి వస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ మధ్య చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు కొద్దిరోజుల్లోనే ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. మరి, వారసుడు మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
hold tight because the wait is over!
here he comes 🤩#VarisuOnPrime, Feb 22
coming soon in Tamil, Telugu and Malayalam!#Thalapathy @actorvijay @directorvamshi @iamrashmika @MusicThaman @karthikpalanidp pic.twitter.com/AM8xYn44bi— prime video IN (@PrimeVideoIN) February 17, 2023