ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలకు ఆదరణ పెరిగిపోతుంది. ఓటిటి సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ కాస్ట్ ఉన్న థియేట్రికల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో ప్రేక్షకులు ఇలా ఓటిటిలవైపు మొగ్గు చూపుతున్నారు. థియేట్రికల్ సినిమాలంటే పాజిటివ్ బజ్ తో పాటు బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సి ఉంటుంది. అదే ఓటిటి సినిమాలకు టాక్ తో సంబంధం లేదు. ఇంట్లో కూర్చొని హాయిగా సినిమాలు చూసేయొచ్చు. అదీగాక ఓటిటిలో సినిమాలతో పాటు పాపులర్ వెబ్ సిరీస్ లు చూసే వెసులుబాటు కూడా ఉంది. దీంతో ఆడియెన్స్ అంతా రెండేళ్లుగా ఓటిటిలకు జై కొడుతున్నారు.
ఇక గతంలో బాక్సాఫీస్ వద్ద స్టార్స్ సినిమాలు పోటీ పడుతుండేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒక్క వారంలోనే 20కి పైగా సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కోసారి ఒక్కరోజే పదిహేనుకి పైగా ఓటిటి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే.. ఈ శుక్రవారం కూడా ఓటిటి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు చాలా సినిమాలు రెడీ అయిపోయాయి. శుక్రవారం అంటే.. నవంబర్ 18న ఒకేరోజు సుమారు 24 సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో బ్లాక్ బస్టర్ ఇండియన్ సినిమాలతో పాటు హాలీవుడ్, ఇతర దేశాల సినిమాలు/సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.