ప్రేక్షకులను అలరించేందుకు డిజిటల్ ప్లాట్ ఫాములు ఎక్కువగా పోటీ పడుతున్నాయి. వారవారం థియేటర్స్ లో ఎన్ని సినిమాలు పోటీపడినా.. ఆఖరికి అవన్నీ రావాల్సింది ఓటిటిలోకే కాబట్టి.. ఆడియెన్స్ కూడా కొంతకాలంగా ఓటిటి సినిమాలకే ఎక్కువగా అలవాటు పడిపోయారు. ఓటిటి అనగానే.. సినిమాలు మాత్రమే కాదుగా.. వెబ్ సిరీస్ లు, సెలబ్రిటీ షోస్ కూడా ఇంట్లో ఉండి చూడవచ్చు అనే ఆలోచన కూడా ప్రేక్షకులలో నాటుకుపోయింది.
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అలరించేందుకు డిజిటల్ ప్లాట్ ఫాములు ఎక్కువగా పోటీ పడుతున్నాయి. వారవారం థియేటర్స్ లో ఎన్ని సినిమాలు పోటీపడినా.. ఆఖరికి అవన్నీ రావాల్సింది ఓటిటిలోకే కాబట్టి.. ఆడియెన్స్ కూడా కొంతకాలంగా ఓటిటి సినిమాలకే ఎక్కువగా అలవాటు పడిపోయారు. గతంలో అంటే.. ఎలాంటి కంటెంట్ ఉన్నా.. హీరోలను బట్టి, థియేటర్స్ కి పరుగు తీసేవారు. కానీ, కొన్నాళ్ళుగా సినిమాలు చూసే విధానంలో చాలా మార్పులు వచ్చేశాయి. హీరోలను బట్టి కాకుండా కంటెంట్.. సినిమాలకు వస్తున్న టాక్ విని సినిమాలకు వెళ్లడమో.. లేదా ఆ సినిమాలు ఓటిటిలో వచ్చేదాకా వెయిట్ చేయడమో చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడున్న కాలంలో థియేటర్స్ కంటే ఓటిటి సినిమాలు ఎక్కువ సంఖ్యలో తెరపైకి వస్తున్నాయి. కాబట్టి.. మేకర్స్ కూడా ఓటిటి ఆడియెన్స్ కి కావాల్సిన అంశాలు ఉండేలా చూసుకుంటున్నారు. అదీగాక ఓటిటి అనగానే.. సినిమాలు మాత్రమే కాదుగా.. వెబ్ సిరీస్ లు, సెలబ్రిటీ షోస్ కూడా ఇంట్లో ఉండి చూడవచ్చు అనే ఆలోచన కూడా ప్రేక్షకులలో నాటుకుపోయింది. సో.. ఓటిటి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే.. ఈ వారం చాలా ఓటిటిలు దాదాపు ఇరవైకి పైగా సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కి సిద్ధం చేశాయి. అదికూడా ఒకే రోజు.. మార్చి 10న ఓటిటిలో ఏకంగా 26 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!