ఓటీటీలో చూడటానికి మీరు తెలుగులో కొత్త సినిమాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. పూర్తిగా చదివితే ఏ మూవీ చూడొచ్చనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
అదేంటి ఈ వారం స్టార్టింగ్ లో 26 సినిమాలు అని చెప్పావ్.. రేపు అంటే మే 26న శుక్రవారం కూడా అన్నే మూవీస్ రిలీజ్ అవుతున్నాయా? అలా ఎలా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ కొన్ని చిత్రాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని సడన్ సర్‌ప్రైజ్‌ల్లా ఎంట్రీ ఇచ్చాయి. అందులో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తోపాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్. అలానే అవి కాస్త బజ్ క్రియేట్ చేయడంతో పాటు వీకెండ్ కి ఎలాగైనా సరే చూసేయాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఓటీటీలో రేపు ఒక్కరోజే విడుదలయ్యే సినిమాలేంటి? వాటి సంగతేంటి? చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతివారం థియేటర్ కి వెళ్లి చూడాలంటే చాలా ఖర్చు అవుతుంది. అదే ఓటీటీలో అనుకోండి తక్కువ డబ్బులకే మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ పొందొచ్చు. అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ కూడా ప్రతివారం, వీకెండ్ లెక్కకు మించి మూవీస్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. అలా ఈ వీకెండ్ కూడా ఏకంగా 26 కొత్త సినిమాలు/ వెబ్ సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో మిగతా వాటి సంగతేమో కానీ సత్తిగాని రెండెకరాలు, తోడేలు, బూ సినిమాలతో పాటు ఫహాద్ ఫాజిల్ మూవీ కూడా ఒకటి ఉంది. మరి వీటిలో మీ ఛాయిస్ ఏంది?