ఈ వీకెండ్ కి ఏం సినిమాలు చూడాలో అర్థం కావట్లేదా? ఏం కంగారు పడాల్సిన పనిలేదు. జస్ట్ ఈ స్టోరీ చదివేయండి. ఇందులో ఏ మూవీ చూడాలో ఫిక్స్ అయిపోయింది. మరి మీ ఛాయిస్ ఏది?
మరో వీకెండ్ వచ్చేసింది. ఆఫీస్, వర్క్ హడావుడి నుంచి కాస్త రిలీఫ్ అవ్వడానికి చాలామందికి గుర్తొచ్చేది సినిమా. రిలీఫ్ ఇవ్వడంతో పాటు ఎంటర్ టైన్ లేదా థ్రిల్ కచ్చితంగా ఇస్తుంది. ఇంట్లో నుంచి కాలు కదపకుండా ఎంజాయ్ మెంట్ ఇస్తుంది. ఇందుకు తగ్గట్లే ఈ వీకెండ్ కి బోలెడన్ని సినిమాలు రెడీ అయిపోయాయి. వాటిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలు/వెబ్ సిరీసులు లెక్కలేనన్ని ఉన్నాయి. మీరు చూసే ఓపిక ఉండాలి అంతే. ఇంతకీ ఈ వీకెండ్ రాబోతున్న కొత్త సినిమాల సంగతేంటి చూసేద్దామా!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీలు మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎంటర్ మెంట్ సోర్స్ ఏదైనా ఉందంటే అది సినిమాలు/ వెబ్ సిరీసులు మాత్రమే. వీళ్లకోసమా అన్నట్లు ఆయా ఓటీటీ సంస్థలు కూడా చాలా అంటే చాలా కొత్త కొత్త మూవీస్ తీసుకొస్తున్నాయి. ఈ వారం అలా తెలుగులో విరూపాక్ష, ఏజెంట్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు మెగాడాటర్ నిహారిక చేసిన ‘డెడ్ పిక్సల్’ సిరీస్ కూడా రేపే రిలీజ్ కానుంది. దీంతో పాటు ‘ఏమి సేతురా లింగా’ అనే తెలుగు మూవీ కూడా ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ మొత్తం లిస్ట్ లో ‘విరూపాక్ష’ కోసమే దాదాపు అందరూ వెయిట్ చేస్తున్నారు.