రేపు ఒక్కరోజే ఓటీటీలో 27 కొత్త సినిమాలు/ వెబ్ సిరీసులు రాబోతున్నాయి. తెలుగు మూవీస్ దగ్గర నుంచి హిందీ సిరీసుల వరకు ఈ లిస్టులో చాలానే ఉన్నాయి.
వీకెండ్ వస్తే చాలు కుర్రాళ్లంతా చిల్ అవుదామని చూస్తారు. మూవీ లవర్స్ మాత్రం కొత్త సినిమాలు/ సిరీస్ లు ఏం రిలీజ్ అవుతున్నాయా? వాటిని ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేద్దామా అని వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఈ వీకెండ్ లో అంటే రేపు ఒక్కరోజు ఏకంగా 27 సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. వీటిలో తెలుగు సినిమాల దగ్గర నుంచి ఇంగ్లీషి మూవీ-వెబ్ సిరీసుల వరకు చాలానే ఉన్నాయండోయ్. ఇంతకీ ఓటీటీలో కొత్త చిత్రాల సంగతేంటి? దాని లెక్కేంటనేది ఇప్పుడు చూసేద్దాం.
అసలు విషయానికొచ్చేస్తే.. ఈ వీకెండ్ కి ఓటీటీల్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏం ఉండవేమో అని అనుకున్నాం. కానీ సమంత ‘శాకుంతలం’ సడన్ ఎంట్రీ ఇచ్చింది. చెప్పిన టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది. హిందీ మూవీ ‘భోలా’ కూడా పే పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్, ‘సొప్పన సుందరి’ అనే డబ్బింగ్ సినిమా, ‘విక్రమ వేద’ హిందీ మూవీ ఇలానే లిస్టులో చాలానే మంచి మంచి మూవీస్ ఉన్నాయి. మరి రేపు ఒక్కరోజే ఓటీటీలోకి రాబోతున్న పూర్తి సినిమాల లిస్టుపై ఓ లుక్కేయండి.