ఉగాదికి ఈసారి థియేటర్/ ఓటీటీల్లో కొత్త సినిమాలు వచ్చాయి. వాటిని చాలావరకు ప్రేక్షకులు చూసేశారు. అయినా సరే ఈ వీకెండ్ కి ఓటీటీల్లో బోలెడన్నీ కొత్త మూవీస్ రిలీజ్ కు సిద్ధమైపోయాయి. ఇంతకీ అవేంటో తెలుసా?
కొత్త మూవీని మీరు థియేటర్ కి వెళ్లి చూస్తారా? ఓటీటీలో చూస్తారా? అంటే చాలామంది రెండో దానికే ఓటేస్తారు. టైమ్ కుదరకపోవడమో, మరే కారణమో తెలియదు గానీ ఓటీటీలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకు తగ్గట్లే వాటిలో ప్రతివారం పదుల సంఖ్యలో కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం.. ఇలా ఒకటేమిటి ప్రపంచంలోనే దాదాపు అన్ని భాషల చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వీకెండ్ ఏకంగా 23 సినిమాలు ఓటీటీల్లో విడుదల కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి అనేది ఇప్పుడు చూసేద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతివారంలానే ఈ వారం కూడా 20కి పైగానే సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిపోయాయి. అయితే ఉగాది రావడంతో తెలుగు సినిమాలు, డబ్బింగ్ సినిమాలన్నీ చాలావరకు బుధవారమే విడుదలైపోయాయి. దీంతో తెలుగు సినిమాలు కొత్తవి ఏవి లేకుండానే ఈ వీకెండ్ గడిచిపోనుంది. వీటిలో పలు మలయాళ, తమిళ సినిమాలు కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఏ భాషయినా సరే పర్లేదు, మాకు కావాల్సింది ఎంటర్ టైన్ చేసే సినిమాలు అనుకుంటే మాత్రం ఈ వీకెండ్ మీదే. ఇంకెందుకు లేటు అలాంటి వాళ్లు కింద ఉన్న లిస్టు ఓసారి చూసేయండి. ఈసారి ఏయే సినిమాలు చూడాలనేది ప్లాన్ చేసేసుకోండి.