ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా మీరు సినిమాల పండగ చేసుకోవచ్చు. దాదాపు 23 వరకు కొత్త చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వాటిలో ఆస్కార్ గెలుచుకున్న మూవీతో పాటు పలు తెలుగు సినిమాలు ఉండటం విశేషం.
సోమవారం వస్తే అందరూ ఆఫీస్ లకు వెళ్లాలని ఎలా మెంటల్ గా ప్రిపేర్ అవుతారో.. వీకెండ్ వస్తుందంటే చాలు ఏదైనా కొత్త సినిమా చూసేద్దామని అనుకుంటారు. అందుకోసమే అన్నట్లు ఓటీటీలో ప్రతివారం 20కి తక్కువ కాకుండా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మిగతా రోజుల్లో స్ట్రీమింగ్ అవుతాయేమో కానీ.. దాదాపు అయితే శుక్రవారానికి ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చేస్తాయి. అలా రేపు ఒక్కరోజే ఏకంగా 23 చిత్రాల వరకు విడుదలకు సిద్ధమైపోయాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. భాషతో సంబంధం లేదు, ఏదైనా సినిమా బాగుందంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి మొహమాటం పెట్టుకోకుండా చూసేస్తారు. అది మనవాళ్లంటే. వాళ్లకోసమే అన్నట్లు మేం కూడా ప్రతివారం ఓటీటీ లిస్టుతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. అలా ఈ వీకెండ్ లో రాబోయే చిత్రాల సంగతులతో వచ్చేశాం. ఇక ఈ జాబితాలో ‘సార్’, ‘రైటర్ పద్మభూషణ్’ లాంటి సినిమాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. అదే టైంలో ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్న ‘ద వేల్’ కూడా ఈ వీకెండే స్ట్రీమింగ్ కానుంది. పునీత్ రాజ్ కుమార్ చివరగా తెరపై కనిపించిన డాక్యుమెంటరీ కూడా అతడి పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న రిలీజ్ కానుంది.