ఈ వీకెండ్ ఏమైనా బయటకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ స్టోరీ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే బయటకెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని కొత్త మూవీస్ చూడాలనుకుంటే మాత్రం ఇది మీకోసమే. ఎందుకంటే ఈ వీకెండ్ కి అంటే రేపు ఒక్కరోజే దాదాపు 21 సినిమాలు/వెబ్ సిరీసులు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తోపాటు బోలెడన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాల సంగతేంటి? తెలియాలంటే లేటు చేయకుండా పూర్తిగా చదివేయండి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతివారం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మహా అయితే ఓ 5-6 కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ వారం కూడా అహింస, పరేషాన్ లాంటి చిన్న చిత్రాలు సందడి చేయబోతున్నాయి. వీటికి హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్లకు వెళ్లి చూసేంత సీన్ లేదు. కాబట్టి ఈ వారం కూడా ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొస్తున్నాయి, వాటిలో ఏవి చూడాలో ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. వాళ్లకోసమా అన్నట్లు రేపు ఓటీటీలోకి విశ్వక్, ఉగ్రం, ముంబైకర్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ వచ్చేస్తున్నాయి. మరి వీటిలో మీ ఛాయిస్ ఏదో సెలెక్ట్ చేసుకుని కింద కామెంట్ చేయండి.