ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ కి పండగే. ఎందుకంటే రేపు అనగా శుక్రవారం ఏకంగా 17 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో సుధీర్, సొహెల్ సినిమాలు ఉన్నాయి.
ఓటీటీలోకి ప్రతివారం కూడా కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. దీనికి అంతం లేదు, ఉండదు కూడా. ఎప్పటిలానే ఈ వారం కూడా ఏకంగా 30 సినిమాల వరకు రిలీజ్ కానున్నాయని మొన్నం చెప్పుకున్నాం కదా. అందులో దాదాపు 10-13 మూవీస్ /వెబ్ సిరీస్ ల వరకు ఆల్రెడీ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. మరికొన్ని మాత్రం శుక్రవారం అంటే రేపు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న కొన్ని చిత్రాలు కూడా ఉండటం విశేషం. ఇంతకీ ఆ సినిమాలేంటి? వాటి సంగతేంటి చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం ఓటీటీలోకి చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు అయితే రాలేదు. దాదాపు అన్ని చిన్న సినిమాలే వచ్చాయి. మలయాళ డబ్బింగ్ ‘మాలికాపురం’తో పాటు ‘సదా నిన్ను నడిపే’ సినిమాలు హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరోవైపు ఆహాలో రేపు ఒక్కరోజు మూడు కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో సుడిగాలి సుధీర్ ‘గాలోడు’, సొహెల్ ‘లక్కీ లక్ష్మణ్’, సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ ఉన్నాయి. ఇవి కాకుండా హిందీకి సంబంధించిన ‘సర్కర్’ మూవీ, ‘ద నైట్ మేనేజర్’ వెబ్ సిరీసులు ఓటీటీ లవర్స్ ని ఆసక్తి కలిగిస్తున్నాయి.