మీకు ఓటీటీలో సినిమాలు చూసే అలవాటు ఉందా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఎందుకంటే రేపు ఒక్కరోజే ఏకంగా 22 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. మరి వీటిలో మీరేం చూస్తారు?
ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. థియేటర్లలోకి ‘రావణాసుర’, ‘మీటర్’ మూవీస్ వస్తుండగా.. ఓటీటీలో మాత్రం రేపు ఒక్కరోజే 22 సినిమాలు విడుదలకు సిద్ధమైపోయాయి. వాటిలో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలేం లేకపోయినప్పటికీ పలు డబ్బింగ్ సినిమాలు కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటితోపాటు ఇంగ్లీష్, హిందీ సిరీస్, మూవీస్ కూడా చాలానే ఉన్నాయండోయ్. వీటిలో మీరేం చూడాలనుకుంటున్నారో ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోవడం మంచిది. ఇంతకీ ఓటీటీలో కొత్త సినిమాల సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం!
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఎక్కడ చూసినా సరే బాగుంటే చాలని ప్రేక్షకులు అనుకుంటారు. కుదిరితే థియేటర్ కు వెళ్తారు. లేదంటే ఓటీటీలో నచ్చినప్పుడు చూస్తారు. అలా ఈ వారం 22 మూవీస్ వచ్చేస్తున్నాయి. వాటిలో మలయాళ డబ్బింగ్ సినిమా ‘రోమాంచమ్’ ఆసక్తి కలిగిస్తోంది. హారర్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమా ఆ భాషలో హిట్ అయింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. మరోవైపు ‘ప్రణయ విలాసం’, ‘బుర్ఖా’, ‘అయోతి’ లాంటి చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మరి వీటిలో ఏది బాగుంది? ఏది బాగోలేదు అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.