ఈ వీకెండ్ మీరు సినిమాల జాతర చేసుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా 31 సినిమాలు/వెబ్ సిరీసులు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. వాటిలో తెలుగు మూవీస్ తోపాటు బోలెడన్ని ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ఇంగ్లీష్, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.
వారంలో ఏడు రోజులన్నా సరే అందరికీ శుక్రవారం అంటేనే చాలా ఇష్టం. ఎందుకో చెప్పండి. వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి. స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి ఆఫీస్ కు వెళ్లే ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరూ ఎదురుచూసేది వీకెండ్ కోసమే. ప్రతిసారి వీకెండ్ కి ఏమేం ప్లాన్ చేయాలనేది ముందు నుంచి ఎన్నో అనుకుంటారు. బయటకు ఎక్కడికైనా వెళ్లాలి, అది సెట్ కాకపోతే ఓటీటీలో కొత్త మూవీ ఏదైనా చూడాలి అని అనుకుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా ఈ వీకెండ్ ఏకంగా 31 సినిమాలు/వెబ్ సిరీసులు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైపోయాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు మనవాళ్లు, తెలుగు సినిమాలు ఏమైనా ఉన్నాయా బ్రో అని తెగ సెర్చ్ చేస్తారు. గత రెండు వారాల నుంచి సరైన తెలుగు మూవీస్ రాలేదు గానీ ఈ వీకెండ్ కి మాత్రం ధమ్కీ, కబ్జ, అసలు, ఓ కల.. ఇలా పలు తెలుగు చిత్రాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమైపోయాయి. వీటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, మరికొన్ని శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మరి వాటిలో మీరు ఏం చూస్తారు? ఇంతకీ ఓటీటీలో ఈ వీకెండ్ కి రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం.
అడ్డా టైమ్స్: