ఇటీవల కాలంలో థియేట్రికల్ సినిమాలకంటే ఓటిటి వేదికలకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు కామన్ ఆడియెన్స్. ఎందుకంటే.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాక సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో వెబ్ సిరీసులు, సీరియల్స్, షోస్ కూడా అందులోనే చూడవచ్చు. పైగా ఒక్కో ఓటిటిలో కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. సో.. జనాలంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. థియేట్రికల్ రిలీజ్ మూవీస్ కోసం కాకుండా ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఓటిటిలు కూడా పదుల సంఖ్యలో ఉండేసరికి ఇంట్లో కూర్చుని సినిమాలు ఎంజాయ్ చేసే ప్లాన్ లో ఉంటున్నారు.
ఇక ప్రముఖ ఓటిటిలన్నీ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ముందుగానే హక్కులు కొనుక్కొని లైనప్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం పదుల సంఖ్యలలో సినిమాలు/వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అయితే.. ఈ వారం కూడా ఇరవైకి పైగా సినిమాలు అనౌన్స్ అయినప్పటికీ, ఆల్రెడీ కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ మొదలయ్యాయి. అదీగాక శుక్రవారం సెపరేట్ గా రిలీజ్ అయ్యే సినిమాలు వేరు. కాగా.. ఇప్పుడు ఈరోజు ఒకేసారి దాదాపు 19 సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. సో.. ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ కానున్న సినిమాలేంటో చూద్దాం!