చెప్పేదేముంది.. ఎప్పటిలానే ఈ వారం కూడా బోలెడన్ని సినిమాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇందులో స్మాల్ బడ్జెట్ తో తీసిన పలు తెలుగు మూవీస్ ఉండగా.. మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా ఉండటం విశేషం. దీంతో ఆడియెన్స్ ఇప్పటికే వీకెండ్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ మూవీ చూడాలనేది స్కెచ్ వేసుకుంటున్నారు. అలానే ఏడాది చివరికొచ్చేశాం రిలీజ్ కి నోచుకోని కొన్ని సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయనేది చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కరోనా తర్వాత మన లైఫ్ చాలా మారిపోయింది. థియేటర్ కి వెళ్లే వారి కంటే ఓటీటీల్లో మూవీస్ చూసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. ఒకప్పుడు థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీల్లోకి వచ్చేవి. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా ప్రతి వారం ఏయే సినిమాలు వస్తున్నాయి? వాటిని ఎందులో ఎలా చూడాలి? అనేవి ప్లాన్ చేసి పెట్టుకుంటున్నారు. అలా ఈ వారం మాచర్ల నియోజకవర్గం, ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ తదితరల సినిమాలు ఆడియెన్స్ ని పలకరించనున్నాయి.