ఓటీటీ లవర్స్ గెట రెడీ. ఈ వారం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు బోలెడన్ని సినిమాలు సిద్ధమైపోయాయి. ఇంతకీ వాటి సంగతేంటి? ఏయే సినిమాలు లిస్టులో ఉన్నాయి?
చాలామందికి సినిమాలు చూడటం సరదా కాదు వ్యసనం. అవును మీరు విన్నది నిజమే. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ ఎలా తాగుతారో కొందరు సినిమా చూసి రోజుని ప్రారంభిస్తారు. వాళ్ల కోసమా అన్నట్లు ప్రతివారం కొత్త కొత్త సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. నాగచైతన్య ‘కస్టడీ’ ఈ వారం థియేటర్లలోకి రానుంది. దాని గురించి అలా పక్కనబెడితే ఈ వారంలో ఏకంగా 23 కొత్త మూవీస్ రిలీజ్ కు రెడీ అయిపోయాయి. ఇంతకీ ఆ చిత్రాలంటే? ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం!
అసలు విషయానికొస్తే.. సోమవారం వస్తే చాలు అందరూ ఎవరి పనుల్లో వాళ్లు పడిపోతారు. ఆఫీసులు, ఉద్యోగాలు లాంటి వాటితో బిజీ బిజీగా మారిపోతారు. సాయంత్రం కాస్త రిలాక్సేషన్ దొరికిన టైంలో ఏదైనా సినిమా లేదంటే వెబ్ సిరీస్ చూసి కాస్త సేదతీరాలని అనుకుంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారం ఏకంగా 23 కొత్త మూవీస్/వెబ్ సిరీసులు సిద్ధమైపోయాయి. వాటిలో ఆహాలో రిలీజ్ కాబోతున్న ‘న్యూసెన్స్’ సిరీస్ కాస్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. దీనితోపాటు సొప్న సుందరి అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. దహాద్ అనే హిందీ సిరీస్ ఆసక్తి రేపుతోంది.