ఈ ఏడాది సంక్రాంతి కూడా అందరూ సక్సెస్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సొంతూళ్లకు వెళ్లినవాళ్లు దాదాపుగా తిరిగి ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు. ఆఫీసులకు కూడా వెళ్లిపోతున్నారు. మిగిలిన వాళ్లు కూడా తమ తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇక పండక్కి రిలీజైన చిరు, బాలయ్య సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాల్ని కూడా ఆల్మోస్ట్ అందరూ చూసేశారు! ఇప్పుడు కొత్తవారం వచ్చేసింది కాబట్టి ఈ వీకెండ్ లో చూడటానికి కొత్త సినిమాలు ఏమున్నాయి అని అప్పుడే సెర్చ్ చేస్తున్నారు.
ఇక విషయానికొస్తే.. మొన్నమొన్న న్యూయర్, రీసెంట్ గానే సంక్రాంతి చేసుకున్నట్లు గుర్తు. కానీ అప్పుడే జనవరి చివరి వారానికి వచ్చేశాం. ఎప్పటిలానే ఈ వారం కూడా ఏకంగా 20 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిపోయాయి. ఆహా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, జీ5లో ఈ వారాంతం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు పలు కొత్త చిత్రాలు సిద్ధమైపోయాయి. వాటిలో ’18 పేజెస్’ లాంటి లవ్ స్టోరీతో పాటు ‘యాన్ యాక్షన్ హీరో’ లాంటి ఫైట్స్ ఉండే మూవీస్ కూడా ఉన్నాయి. మరోవైపు త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘రాంగీ’ కూడా రిలీజ్ రెడీ అయిపోయింది.
ఈ వారం ఓటీటీలో విడుదల కాబోయే మూవీస్ లిస్ట్