Home » Ott News » This Week Ott Release Movies Telugu May 4th Week 2023
ఈ వారం OTTలోకి ఏకంగా 26 మూవీస్.. ఆ రెండు మాత్రం స్పెషల్!
ఈ వారం కూడా ఓటీటీలో సినిమాల సందడికి వేళ అయిపోయింది. ఏకంగా 26 కొత్త సినిమాలు/వెబ్ సిరీసులు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
వీకెండ్ అయిపోయింది. మళ్లీ సోమవారం వచ్చేసింది. అందరూ ఆఫీస్ హడావుడిలో పడిపోయారు. మరి రాబోయే వీకెండ్ లో ఏం చేయాలనేది ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి కదా. బయట ఊర్లకి వెళ్లి తిరిగి రావాలంటే అందరికీ కుదరకపోవచ్చు. అలాంటోళ్లు చాలావరకు ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసే ప్లాన్స్ వేస్తుంటారు. ఇప్పుడు వాళ్లకోసమా అన్నట్లు ఈ వారం కూడా ఓటీటీలో బోలెడన్నీ కొత్త సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఇందులో మిగతా వాటి సంగతేమోగానీ ఓ రెండు మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఇంతకీ వీటి సంగతేంటి చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీలకు ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే సోమవారం వచ్చిందంటే చాలు రాబోయే వీకెండ్ కి ఏ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఏమేం చూడాలనేది ముందే ఫిక్సవుతున్నారు. అలా ఈ వారం ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీసులు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో ‘సత్తిగాని రెండెకరాలు’ అనే తెలుగు మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. అలానే ‘తోడేలు’ అనే డబ్బింగ్ సినిమా కూడా ఈ వారమే ఓటీటీలో విడుదల కానుంది. ఈ రెండు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితోపాటు బోలెడన్ని హిందీ, ఇంగ్లీష్ సిరీసులు/ సినిమాలు కూడా ఉన్నాయండోయ్.
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్:
నెట్‌ఫ్లిక్స్:
విక్టిమ్/ సస్పెక్ట్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23
హార్డ్ ఫీలింగ్స్ (జర్మన్ సినిమా) – మే 24
మదర్స్ డే (పోలిష్ మూవీ) – మే 24
ఫ్యూబర్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 25
దసరా (హిందీ వెర్షన్) – మే 25
బ్లడ్ & గోల్డ్ (ఇంగ్లీష్ సినిమా) – మే 26
ద ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్ట్రబేటింగ్ (డానిష్ మూవీ) – మే 26
టిన్ & టీనా (స్పానిష్ సినిమా) – మే 26
ద క్రియేచర్ కేసెస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 22 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
అమెరికల్ బార్న్ చైనీస్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 24
సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 26
అమెజాన్ ప్రైమ్:
మిస్సింగ్ (ఇంగ్లీష్ సినిమా) – మే 24
జీ5:
సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ సినిమా) – మే 23
కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ (హిందీ మూవీ) – మే 26
ఆహా:
గీతా సుబ్రహ్మణ్యం 3 ( తమిళ వెబ్ సిరీస్) – మే 23
సత్తిగాని రెండెకరాలు (తెలుగు సినిమా) – మే 26
జియో సినిమాస్:
బేవఫా సనమ్ (భోజ్ పురి మూవీ) – మే 24
క్రాక్ డౌన్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మే 25
బేడియా (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 26
ఆపిల్ ప్లస్ టీవీ:
ప్లటోనిక్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 24
డిస్కవరీ ప్లస్:
ప్రిజనర్ ఆఫ్ ది ప్రొఫెట్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 25
కేండ్రా సెల్స్ హలీవుడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 26
హోయ్ చోయ్:
రాజ్ నీతి (బెంగాలీ సిరీస్) – మే 26
బుక్ మై షో:
రెన్ ఫీల్డ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 26
ముబీ:
అన్ క్లెంచింగ్ ద ఫిస్ట్స్ (రష్యన్ సినిమా) – మే 26
షీమారో మీ:
చల్ మన్ జిత్వాజాయి 2 (గుజరాతీ మూవీ) – మే 25
Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV