ఈ వారం కూడా ఓటీటీలో సినిమాల సందడికి వేళ అయిపోయింది. ఏకంగా 26 కొత్త సినిమాలు/వెబ్ సిరీసులు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
వీకెండ్ అయిపోయింది. మళ్లీ సోమవారం వచ్చేసింది. అందరూ ఆఫీస్ హడావుడిలో పడిపోయారు. మరి రాబోయే వీకెండ్ లో ఏం చేయాలనేది ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి కదా. బయట ఊర్లకి వెళ్లి తిరిగి రావాలంటే అందరికీ కుదరకపోవచ్చు. అలాంటోళ్లు చాలావరకు ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసే ప్లాన్స్ వేస్తుంటారు. ఇప్పుడు వాళ్లకోసమా అన్నట్లు ఈ వారం కూడా ఓటీటీలో బోలెడన్నీ కొత్త సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఇందులో మిగతా వాటి సంగతేమోగానీ ఓ రెండు మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఇంతకీ వీటి సంగతేంటి చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీలకు ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే సోమవారం వచ్చిందంటే చాలు రాబోయే వీకెండ్ కి ఏ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఏమేం చూడాలనేది ముందే ఫిక్సవుతున్నారు. అలా ఈ వారం ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీసులు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో ‘సత్తిగాని రెండెకరాలు’ అనే తెలుగు మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. అలానే ‘తోడేలు’ అనే డబ్బింగ్ సినిమా కూడా ఈ వారమే ఓటీటీలో విడుదల కానుంది. ఈ రెండు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితోపాటు బోలెడన్ని హిందీ, ఇంగ్లీష్ సిరీసులు/ సినిమాలు కూడా ఉన్నాయండోయ్.