మీకు సినిమాలంటే పిచ్చి ఇష్టమా? అయితే ఈ స్టోరీ మీకోసమే ఎందుకంటే ఈ వారం ఏకంగా 28 కొత్త సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ వాటి సంతేంటి?
ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలోకి బోలెడన్ని మూవీస్ వచ్చేస్తున్నాయి. వాటిలో అయ్యగారు అఖిల్ ‘ఏజెంట్’ దగ్గర నుంచి మొదలుపెడితే లిస్టులో చాలా సినిమాలే ఉన్నాయండోయ్. ఇందులో తెలుగు చిత్రాల కంటే హిందీ, ఇంగ్లీష్ సినిమాలు/సిరీసులు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ లిస్టులో ఏమేం చూడాలనేది ముందే ప్లాన్ చేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమాలతో పాటు వీకెండ్ వచ్చేసరికి మరిన్ని కొత్త మూవీస్ కూడా యాడ్ అయ్యే ఛాన్సు ఉంటుంది. వాటి గురించి కాదులే గానీ ఇంతకీ ఈ వారం ఓటీటీలో ఏమేం మూవీస్ రాబోతున్నాయి. వాటి సంగతేంటి?
ఇక విషయానికొచ్చేస్తే.. కొత్త వారం మొదలైందంటే చాలు కొత్త సినిమాల సందడి కూడా ఆటేమేటిక్ గా స్టార్ట్ అయిపోయింది. ఈ వీకెండ్ కి ఎక్కడికి వెళ్లకపోతే ఏదైనా సినిమా లేదా సిరీస్ చూసి టైమ్ పాస్ చేసేద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం 20కి పైగా సినిమాలు/ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. అలా ఈ వారం ఏకంగా 28 కొత్తవి ఓటీటీల్లో విడుదలకు సిద్ధమైపోయాయి. వాటిలో అఖిల్ ‘ఏజెంట్’ ఒక్కటే కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. అయితే థియేటర్ లోనే దీన్ని ఎవడూ చూడలేదు. అలాంటి ఓటీటీలో చూస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.