మీరు సినిమాలంటే ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నాసరే ఈ స్టోరీ మీకోసమే. ఎందుకంటే ఈ వారం ఏకంగా 21 కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఇంతకీ ఏంటి సంగతి?
సోమవారం వచ్చిందంటే చాలు అందరూ ఆఫీసులకు వెళ్తారు. మూవీ లవర్స్ ఏమో, ఈ వారం కొత్త సినిమాలు ఏం వస్తున్నాయా అని సెర్చ్ చేస్తుంటారు. థియేటర్లకి వెళ్లి చూసే బ్యాచ్ గురించి కాదులే గానీ ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ చూసే బ్యాచ్ ఒకటుంటుంది. వాళ్లకోసమే ఈ స్టోరీ. ఎందుకంటే ప్రతివారం మినిమం 20కి తగ్గకుండా కొత్త మూవీస్ విడుదలవుతుంటాయి. అలానే ఈసారి కూడా ఏకంగా 21 న్యూ సినిమాస్ ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చేస్తున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? చూసేద్దామా!
ఇక వివరాల్లోకి వెళ్తే.. సమ్మర్ లో ఓవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకెళ్లాలంటే భయంభయంగా ఉంది. దీంతో ఏం చేయాలో తెలీక ఓటీటీలో కొత్త మూవీస్ కోసం తెగ వెతికేస్తున్నారు. వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారం 21 కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మీటర్, మ్యాచ్ ఫిక్సింగ్, తు ఝూతి మైన మక్కర్ లాంటి చిత్రాలు కాస్త స్పెషల్ గా కనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్, హిందీ-ఇంగ్లీష్ మూవీస్ కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.