అవును మీరు చూసింది నిజమే. ఈ వారం ఏకంగా 28 సినిమాలు/వెబ్ సిరీసులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో తెలుగు చిత్రాలతో పాటు బోలెడన్నీ ఇంగ్లీష్-హిందీ మూవీస్ కూడా ఉండటం విశేషం.
మార్చి నెల చివరికొచ్చేసింది. పిల్లలందరూ ఎగ్జామ్స్ గోలలో ఉన్నారు. తల్లిదండ్రులు ఆ హడావుడిలో పడిపోయారు. కొందరు మాత్రం కొత్త సినిమాలు ఏమేం రిలీజ్ అవుతున్నాయి. వాటిని ఎప్పుడు చూడాలా అని డిస్కషన్ పెట్టేసుకున్నారు. వాళ్ల కోసమేనా అన్నట్లు ఈ వారం ఏకంగా 28 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో తెలుగు సినిమాలు, సిరీసులతో పాటు బోలెడన్నీ హిందీ-ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి సోమవారం రావడం లేటు. ఆ వారానికి సంబంధించి సినిమాల రిలీజ్ లిస్టుతో మీ ముందుకు వచ్చేస్తాం. ఈ వారం కూడా అలానే పెద్ద జాబితాతో వచ్చేశాం. ఇక లిస్టులోకి వెళ్తే.. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’, షారుక్ ఖాన్ కమ్ బ్యాక్ మూవీ ‘పఠాన్’తో పాటు మన బ్రహ్మానందం చాలారోజుల తర్వాత నటించిన సినిమా ‘పంచతంత్రం’.. ఈ వారంలోనే ఓటీటీలోకి రాబోతున్నాయి. వీటితోపాటు ఇంగ్లీష్- హిందీ సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజులు కూడా ఇందులో ఉండటం విశేషం. మరి మొత్తం లిస్టు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.