మీరు సినిమాలు రెగ్యులర్ గా చూస్తారా? అయితే ఈ వారం మీరు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా 36 కొత్త చిత్రాలు/వెబ్ సిరీసులు ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో తెలుసా?
ఓటీటీ లవర్స్ కి ఈసారి పండగే పండగ. సాధారణంగా ప్రతివారం 20 ప్లస్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో ఏది చూడాలనేది ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. వీకెండ్ లో దాన్ని చూసేస్తుంటారు. కానీ ఈ వారం మాత్రం అంతకు మించి అనేలా మూవీస్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఎందుకంటే ఏకంగా 36 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. వీటిలో భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ నుంచి చిన్న సైజ్ హారర్ చిత్రాల వరకు లిస్టు చాలా పెద్దదే ఉంది. కాకపోతే ఒక్క విషయం మాత్రం తెలుగు ప్రేక్షకులు కాస్త మైనస్ గా కనిపిస్తుంది. ఇంతకీ అదేంటి? దాని సంగతేంటి? చూసేద్దాం.
ఇక విషయానికొస్తే.. సోమవారం వస్తే అందరూ ఆఫీసులకు ఎలా వెళ్తారో, అదే టైంలో ఈ వీకెండ్ ఏం ప్లాన్ చేయాలనేది ముందే ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. వాటిలో కొత్త సినిమా చూసే ప్రోగ్రామ్ కచ్చితంగా ఉంటుంది. అందుకు తగ్గట్లే ఓటీటీలో ప్రతివారం 20కి పైగా న్యూ మూవీస్/వెబ్ సిరీసులు విడుదలవుతూ ఉంటాయి. అలా ఈసారి ఏకంగా 36వరకు రెడీ అయ్యాయి. వీటిలో తెలుగు సినిమా ఏది లేదు. అన్నీ కూడా హాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలు, సిరీసులే. బహుశా ఈ వారంలో కొత్తగా ఏమైనా తెలుగు మూవీస్ డేట్స్ ప్రకటిస్తే ప్రకటించొచ్చు అనిపిస్తోంది.