ఓటీటీ లవర్స్ కి ఈ వారం కూడా పండగే. ఎందుకంటే ఏకంగా 26 కొత్త సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. వాటిలో తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు చాలానే ఉన్నాయండోయ్. మరి వాటి సంగతేంటి చూసేద్దామా!
ఎప్పటిలానే ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాల లిస్ట్ తో మీ ముందుకు వచ్చేశాం. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు కావాల్సిన అన్ని మూవీస్ కూడా ఈసారి ఫుల్ గా ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఈ మధ్య రిలీజైన హిట్, యావరేజ్ సినిమాలతో పాటు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి. తెలుగు, డబ్బింగ్ చిత్రాలతోపాటు పలు హిందీ, ఇంగ్లీష్ మూవీస్.. ఆడియెన్స్ కు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వాటిలో రెండు మాత్రం కాస్త స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత తెలుగు ప్రేక్షకులు దీనికి బాగా అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే ప్రతి సోమవారం.. ఈ వీక్ కొత్త సినిమాలు ఏమేం వస్తున్నాయా అని వెతికేంతలా! అలా ఈసారి ఏకంగా 26 చిత్రాలు విడుదలకు సిద్ధమైపోయాయి. వాటిలో ‘దాస్ కా ధమ్కీ’, ‘కబ్జా’ మూవీస్ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుండగా.. నేరుగా ఓటీటీలోనే ‘అసలు’, ‘ఓ కల’ అనే సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. వీటితోపాటే పలు ఇంగ్లీష్, హిందీ సినిమాలు బాగానే అనిపిస్తున్నాయి. మరి వీటిలో మీరు ఏమేం చూడటానికి రెడీ అవుతున్నారో ముందే ఫిక్స్ చేసి పెట్టుకోండి. లేదంటే మళ్లీ మర్చిపోతారు!
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాల లిస్ట్: