మీకు కొత్త సినిమాలు ఏం చూడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఎందుకంటే ఈ వారం ఏకంగా 38 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీ అయిపోయాయి.
మన లైఫ్ లో కొన్ని పనులు ఏ రోజుకీ ఆ రోజు రిపీట్స్ లో జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఓటీటీ సినిమాలు కూడా చేరిపోయాయి. ఒకప్పుడు ఓటీటీ అంటే జనాలు పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు రోజు ఒక్క సినిమా అయినా చూడందే.. చాలామంది నిద్రపోవడం లేదు. ఎందుకంటే కరోనా పుణ్యమా అని ఓటీటీల కల్చర్ మనకు బాగా అలవాటైపోయింది. పదుల కొద్దీ కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు.. ప్రతివారం రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా 38 వరకు సిరీసులు/సినిమాలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి చూసేద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. థియేటర్ లో కొత్త సినిమా విడుదలవడటం లేటు. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. అలా గత నెల 30న రిలీజై ఫుల్ గా ఎంటర్ టైన్ చేసిన ‘దసరా’.. ఈ వీకెండ్ కి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ‘సేవ్ ద టైగర్స్’, ‘వ్యవస్థ’, ‘యూ & ఐ’ లాంటి వెబ్ సిరీసులు ఓటీటీలో విడుదలకు సిద్ధమైపోయాయి. ‘తురుముఖమ్’, ‘జల్లికట్టు’ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ వారం మీ ముందుకు వచ్చేస్తున్నాయి. ఇలా గత కొన్నాళ్లతో పోలిస్తే ఈ వారం తెలుగు ప్రేక్షకుల కోసం చాలానే ఉన్నాయి. కానీ వాటిలో ‘దసరా’ మాత్రం కాస్త స్పెషల్ గా అనిపిస్తోంది.