టాలీవుడ్ లోకి కొత్త హీరోలు ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలా వచ్చినవాడే బెల్లంకొండ గణేశ్. చాలామందిలా మాస్ ఇమేజ్ కాకుండా క్లాస్ గా ఉంటూ కూల్ గా నవ్వించే కుటుంబ కథా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీ చాలామంది ఆడియెన్స్ ని అలరించింది. కొంతమంది మిస్సయ్యారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమే ఎంటర్ టైన్ చేసేందుకు ఫుల్ ప్రిపేర్ అయిపోయారు. ఇక ఓటీటీ రిలీజ్ డేట్ ని కూడా తాజాగా ప్రకటించారు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్.. ఈ వీకెండ్ కి మంచి మూవీ దొరికేసిందని సంబరపడిపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే… ఈసారి దసరా సందర్భంగా చిరు ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండింటితో పాటు బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమైన ‘స్వాతిముత్యం’ కూడా విడుదలైంది. ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలతో పోటీపడి నిలబడింది. కాకపోతే ‘గాడ్ ఫాదర్’కు హిట్ టాక్ రావడంతో.. ఈ సినిమా గురించి చాలామంది మర్చిపోయారు. చెప్పాలంటే థియేటర్ లో కొంతమంది చూడలేకపోయారు. ఇప్పుడు అలాంటి వాళ్లకోసమే ఈ నెల 28 నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అధికారంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తెలుగు ఇళ్లలో చాలామంది మాట్లాడటానికే ఆలోచించే వీర్యదానం అనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తీశారు. కుటుంబ ప్రేక్షకులకు కూడా ఈ విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడంలో దర్శకుడు లక్ష్మణ్ విజయవంతమయ్యాడు. చేస్తుంది తొలి చిత్రమే అయినప్పటికీ, విమర్శకుల మెప్పు పొందాడు. ఇందులో హీరోయిన్ గా చేసిన వర్ష బొల్లమ్మ, సహాయ నటుడిగా రావు రమేశ్ అద్భుతంగా నటించారు. దివ్య శ్రీపాద, సురేఖా వాణి, ప్రగతి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించి అలరించారు. ఈ వీకెండ్ కి ఏదైనా హోల్ సేల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడాలనుకుంటే మాత్రం ‘స్వాతిముత్యం’ని ట్రై చేయండి. మరి ఒకవేళ ఇప్పటికే ఈ సినిమా చూసుంటే, ఎలా ఉందో దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Overall ga #SwathimuthyamOnAHA, pakka entertainer 😉
Premieres Oct 28@VarshaBollamma #GaneshBellamkonda @vamsi84 @Lakshmankkrish2 @adityamusic pic.twitter.com/dO9W6yUFvD— ahavideoin (@ahavideoIN) October 18, 2022