ఇదివరకు సినిమాలు రిలీజ్ అయ్యాక.. వాటి ఫలితాలతో సంబంధం లేకుండా ఓటిటిలు స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసేవి. కానీ.. ఇప్పుడు ఓటిటిలకు డిమాండ్ పెరిగిపోయింది. కాబట్టి.. ముందుగా ఓటిటిలతో ఒప్పందాలు కుదిరాకే సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన బయటికి వచ్చింది.
ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ ఓటిటి వేదికలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అన్నీ అని కాదుగాని.. కొన్ని సినిమాల వరకు ఇదే జరుగుతోంది. ఇదివరకు సినిమాలు రిలీజ్ అయ్యాక.. వాటి ఫలితాలతో సంబంధం లేకుండా ఓటిటిలు స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసేవి. కానీ.. ఇప్పుడు ఓటిటిలకు డిమాండ్ పెరిగిపోయింది. కాబట్టి.. ముందుగా ఓటిటిలతో ఒప్పందాలు కుదిరాకే సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అదీగాక రిలీజ్ అయ్యాక రిజల్ట్ బట్టి.. సినిమాలను ఎన్ని వారాలకు స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయానికి వస్తున్నాయి ఓటిటి వేదికలు.
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సార్’. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. తమిళంలో ‘వాతి’ పేరుతో రిలీజ్ అయ్యింది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల తర్వాత వెంకీ రూపొందించిన సినిమా ఇది. అయితే.. ధనుష్ హీరోగా నటించడం.. సాంగ్స్ కూడా మంచి హిట్ అవ్వడంతో సినిమాపై మినిమమ్ అంచనాలు ముందుగానే క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో ధనుష్ కి జోడిగా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ నటించింది. విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
ఇక శివరాత్రి సందర్భంగా(ఫిబ్రవరి 17)న థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా.. తమిళ, తెలుగు భాషలలో మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ధనుష్ కి తెలుగులో సాలిడ్ డెబ్యూ లభించడమే కాకుండా.. కలెక్షన్స్ కూడా భారీగానే కొల్లగొట్టింది సార్. అయితే.. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. సార్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ వారు సొంతం చేసుకున్నారు. కాగా.. థియేట్రికల్ రిలీజైన నెల రోజులకే సినిమాని డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సార్ మూవీ మార్చి 17 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో ధనుష్ ఫ్యాన్స్, ఓటిటి ఆడియెన్స్ సార్ మూవీ డిజిటల్ రిలీజ్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి సార్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
If Dhanush was our #Vaathi, we’d be ready to give up P.T period to attend his class!📚 🏫
Vaathi is coming to Netflix on the 17th of March! 🤩 pic.twitter.com/GJbqgZ0zFY— Netflix India South (@Netflix_INSouth) March 12, 2023