సమంత 'శాకుంతలం' ఓటీటీలోకి వచ్చేసింది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఎప్పుడు ఎందులోకి వచ్చిందో తెలియాలంటే స్టోరీ చదివేయండి.
సమంత ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘శాకుంతలం’. మహాభారతంలోని ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ సినిమా.. గతనెల అంటే ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చింది. పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ మూవీ త్రీడీలో రిలీజైంది. రిలీజ్ కి ముందే కాస్త డౌట్ డౌట్ గా అనిపించిన ఈ మూవీ.. ప్రేక్షకుల నుంచి అదే రిజల్ట్ అందుకుంది. దీంతో చాలామంది తర్వాత చూద్దాంలే అని వదిలేశారు. వాళ్లకోసమా అన్నట్లు ఇప్పుడు ‘శాకుంతలం’ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా చెప్పిన టైమ్ కంటే ముందే.. ఇంతకీ ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’ తర్వాత పీరియాడిక్ సినిమాల ట్రెండ్ చాలా పెరిగిపోయింది. అన్ని భాషల్లోనూ ఆ తరహా మూవీస్ వచ్చాయి. కానీ ఏది రాజమౌళి క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ని అందుకోలేకపోయాయి. ‘శాకుంతలం’ విషయంలోనూ సేమ్ సీన్ రిపీటైంది. చాలా ఇబ్బందులు దాటుకుని గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు నెలకూడా తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
చెప్పాలంటే సమంత ‘శాకుంతలం’ మూవీని మే 12 నుంచి స్ట్రీమింగ్ చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. ఇప్పుడు చెప్పిన టైమ్ కంటే ముందే అంటే మే 11న ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్ లో చూడటానికి కష్టపడొచ్చు. ఓటీటీనే కాబట్టి ఫార్వర్డ్ చేసుకుంటూ అలా చూసేయొచ్చు. ఇదిలా ఉండగా ‘శాకుంతలం’ని రూ.80 కోట్లు పెట్టి తీస్తే.. కేవలం రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. సో అదనమాట విషయం. మరి మీలో ఎవరైనా ‘శాకుంతలం’ సినిమా చూస్తే.. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.
Samantha’s #Shaakuntalam is streaming now on AMAZON PRIME. pic.twitter.com/R9HFKv10Lw
— Christopher Kanagaraj (@Chrissuccess) May 10, 2023