సమంత 'శాకుంతలం' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఆ తేదీ నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్స్ సినిమాలు ఓ మాదిరిగా అయినా ఉంటాయి. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు కేర్ తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు దారుణంగా మిస్ ఫైర్ అవుతుంటాయి. అలా ఈ మధ్య కాలంలో ఘోరంగా అంటే ఘోరంగా బోల్తా కొట్టిన సినిమాల్లో ‘శాకుంతలం’ ఒకటి. గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిపోయింది. సరిగ్గా నెల కూడా కాకముందే ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో హీరోయిన్ సమంతది ప్రత్యేక స్థానం. గ్లామరస్ రోల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ యాక్టర్ గా చాలా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తూ వస్తోంది. అలా గతేడాది ‘యశోద’తో యావరేజ్ అనిపించుకుంది. ‘శాకుంతలం’తో ఘోరమైన ఫ్లాప్ సొంతం చేసుకుంది. స్టోరీ పరంగా బాగానే ఉన్నప్పటికీ.. గ్రాఫిక్స్, మిగతా చాలా టెక్నికల్ విషయాల్లో ఈ మూవీ తేలిపోయింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి అలా అలా చూసేయొచ్చు.
‘శాకుంతలం’ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇప్పుడు మే 12న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తొలుత మే 19న అని అన్నారు కానీ వారం రోజుల ముందే అంటే కొన్నిరోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది అనమాట. టాక్ గురించి పక్కనబెడితే ఓటీటీలో కాబట్టి ‘శాకుంతలం’ని అలా చూసేయొచ్చు. సరే ఇదంతా పక్కనబెడితే ఈ మూవీని మీలో ఇప్పటికే ఎవరైనా చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.
EXCLUSIVE:
• #Samantha‘s Recent PAN INDIA Release #Shaakuntalam Planned To Premiere From MAY 12 On Prime Video in Telugu, Hindi,Tamil, Malayalam and Kannada.🕊️❤️✨
• #ShaakuntalamOTT pic.twitter.com/OqWarFMaQJ
— OTT STREAM UPDATES (@newottupdates) May 4, 2023