చిత్ర పరిశ్రమలో కొంత మందికి మాత్రమే విలక్షణమైన కథలను ఎంపిక చేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వారిలో ముందుంటారు హీరో సత్యదేవ్. ‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, స్కైలాబ్ లాంటి చిత్రాలే దీనికి తార్కాణం. తాజాగా సత్యదేవ్ హీరోగా వచ్చిన చిత్రం గాడ్సే. ఈ మూవీని గోపీ గణేశ్ పట్టాభి తెరకెక్కించారు. వీరి కాంబినేషన్ లో ఇంతకు ముందే బ్లఫ్ మాస్టర్ అనే హిట్ సినిమా వచ్చింది. దీంతో గాడ్సే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే మూవీ మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ జూన్ 17న విడుదలైన విషయం తెలిసిందే.
గాడ్సే కథ విషయానికి వస్తే.. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు పాల్పడుతున్న అవినీతి, అక్రమాలను ఎత్తిచూపుతూ తెరకెక్కిన పొలిటికల్ త్రిల్లర్ గాడ్సే. సత్యదేవ్ టైటిల్ రోల్ లో నటించారు. విశ్వనాథ్ రామచంద్ర అలియాస్ గాడ్సే గా లండన్ లో పేరు పొందిన వ్యాపారవేత్త. అర్హులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే గొప్ప సంకల్పంతో ఇండియాకి వస్తాడు. అనంతరం పలువురు రాజకీయ నాయకులను, పోలీసు ఆఫీసర్స్ ని కిడ్నాప్ చేసి హత్య చేస్తాడు. ప్రభుత్వం ఈ కేసుని ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్యలక్ష్మీ) కు అప్పగిస్తుంది. అసలు గాడ్సే ఎవరు? అతని గతం ఏంటి? ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు? వైశాలి ఈ కేసును ఎలా ఛేదించింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
థియేటర్ లో గాడ్సే మూవీని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటీటీలో చూసేందుకు సిద్ధం కండి. ఎందుకంటే గాడ్సే మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(NETFLIX) ఓటీటీ వేదికగా జూలై 17 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇక సత్యదేవ్ ఆచార్య మూవీలో ప్రత్యేక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సత్యదేవ్.. గుర్తుందా శీతాకాలం, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ‘రామ్ సేతు’ అనే మూవీలో నటిస్తున్నాడు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Agent Teaser: అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ టీజర్ విడుదల!
ఇది కూడా చదవండి: హీరో ధనుష్, ఐశ్వర్యలకు హైకోర్టులో భారీ ఊరట!