రవితేజ 'రావణాసుర' థియేటర్లలోకి వచ్చేసింది. అదే టైంలో ఓటీటీ పార్ట్ నర్ కూడా ఫిక్స్ అయిపోయింది. రిలీజ్ డేట్ కూడా అప్పుడే ఉండొచ్చని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తూనే ఉంటాయి. అలా తాజాగా ప్రేక్షకుల్ని పలకరించిన మూవీ ‘రావణాసుర’. మాస్ మహారాజా రవితేజ హీరో కావడంతో కాస్తలో కాస్త అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇందులో రవితేజది లాయర్ కమ్ నెగిటివ్ క్యారెక్టర్ కావడంతో ప్రేక్షకులు ఎగ్జైట్ అయ్యారు. అదే టైంలో మూవీ కూడా ప్రామిసింగ్ గా ఉండటంతో పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ వీకెండ్ కు ‘రావణాసుర’కు వెళ్లాలని చాలామంది ఫిక్స్ అవుతున్నారు. అదే టైంలో ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని మరికొందరు ఎదురుచూస్తున్నారు. వాళ్లకోసమా అన్నట్లు ఆ అప్డేట్ బయటకొచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ధమాకా’తో హిట్ కొట్టిన రవితేజ, సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ‘రావణాసుర’ హిట్ అందుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు. థ్రిల్లర్ సస్పెన్స్ స్టోరీతో తీసిన ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. భారీ ధరకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలానే రిలీజ్ డేట్ పై కూడా ఓ అప్డేట్ వచ్చేసింది. దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియెన్స్ కూడా అది ఎప్పుడా అని మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. రిలీజైన 5-6 వారాలకు ‘రావణాసుర’ ఓటీటీలోకి అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, టీవీ రైట్స్ ని జీ తెలుగు సంపాదించింది. ఇదిలా ఉండగా ‘స్వామిరారా’ ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మ, ‘పుష్ప’ రైటర్ శ్రీకాంత్ విస్సా కలిసి చేసిన సినిమానే ‘రావణాసుర’. ఈ కాంబినేషన్ లో మరో సినిమా కూడా ఉందని నిర్మాత అభిషేక్ చెప్పుకొచ్చారు. సరే ఇదంతా పక్కనబెడితే ‘రావణాసుర’ మూవీ మీలో ఎంతమంది చూశారు? మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.