మరో కొత్త మూవీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. గోపీచంద్ 'రామబాణం' స్ట్రీమింగ్ డీటైల్స్ బయటకొచ్చేశాయి. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసా?
గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడం, గోపీచంద్ కి అచ్చొచ్చిన శ్రీవాస్.. ఈ సినిమాకు డైరెక్టర్ కావడంతో రిలీజ్ కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వన్స్ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి ఘోరమైన టాక్ వచ్చింది. దీంతో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకున్నారు. ఇప్పుడు వాళ్లకోసమా అన్నట్లు ఆ రిలీజ్ తేదీ సిద్ధమైపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతంతో పోలిస్తే చాలామంది ఓటీటీలంటే తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లు తెలుగు సినిమాలు చాలావరకు థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. రీసెంట్ టైంలో దసరా, రావణాసుర, శాకుంతలం లాంటి సినిమాలు ఇలానే మూడు-నాలుగు వారాల్లోనే ఓటీటీల్లో ప్రేక్షకుల్ని పలకరించాయి. ఇప్పుడు ‘రామబాణం’ కూడా సేమ్ అదే రూట్ ఫాలో అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రిలీజైన నెలలోపు అంటే నాలుగు వారాలు పూర్తికాగానే ఓటీటీలోకి తీసుకొచ్చేయాలని ఫిక్సయినట్లు ఉన్నారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం.. ‘రామబాణం’ ఓటీటీ హక్కుల్ని దక్కించుకున్న సోనీ లివ్, జూన్ 1 లేదా 3వ తేదీ నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. అంటే.. నాలుగు వారాల్లోనే ఇది కూడా ఓటీటీలోకి వచ్చేస్తుందనమాట. ఇందులో గోపీచంద్ తోపాటు జగపతిబాబు, ఖుష్బూ, అలీ లాంటి స్టార్స్ నటించినప్పటికీ సినిమాలో కంటెంట్ సరిగా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. థియేటర్ లో చూడాలంటే కష్టం కానీ ఓటీటీలో ఏముంది ఆడుతూ పాడుతూ చూసేయొచ్చు. సో అదనమాట విషయం. మరి ‘రామబాణం’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి.