తెలుగులో బాగా ట్రోలింగ్ గురై, తాజాగా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'పొన్నియిన్ సెల్వన్ 2'. ఇప్పుడు దీని ఓటీటీ డీటైల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఈ మధ్య కాలంలో పాజిటివ్ లేదా నెగిటివ్ గా చాలా అంటే చాలా ట్రెండ్ అయిన మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. తమిళ ప్రైడ్ అనే ట్యాగ్ లైన్ తో దీన్ని తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. తొలిభాగం తమిళంలో తప్ప ఎక్కడా సరిగా ఆడలేదు. తెలుగు ప్రేక్షకులైతే.. దీన్ని తెగ ట్రోలింగ్ చేశారు. ఎందుకంటే అంత ల్యాగ్ ఉంది మరి. ఈ క్రమంలోనే సీక్వెల్ పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ చాలాచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అదే టైంలో ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ కూడా బయటకొచ్చేశాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ పీరియాడికల్ మూవీస్ ట్రెండ్ మొదలైంది. కానీ ఒక్కరు కూడా సరైన హిట్ కొట్టలేకపోయారు. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఎప్పటినుంచో చెబుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలుగా తీశారు. అందులో ఫస్టా పార్ట్ గతేడాది సెప్టెంబరు చివర్లో థియేటర్లలోకి వచ్చింది. దాదాపు రూ.500 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిందని చెప్పారు. తాజాగా పార్ట్-2ని రిలీజ్ చేశారు. ఇది ఎన్ని కోట్లు సాధిస్తుందో చూడాలి.
‘పొన్నియిన్ సెల్వన్’ తొలిభాగాన్ని చాలావరకు పాత్రల పరిచయానికే ఉపయోగించుకున్న మణిరత్నం.. సీక్వెల్ లో వాటన్నింటికి సమాధానాలు చెప్పారు. డ్రామా కూడా ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. అయితే పీరియాడికల్ మూవీస్ ఇష్టపడేవారికి మాత్రమే ‘పొన్నియిన్ సెల్వన్ 2’ నచ్చుతుందని మాట్లాడుకుంటున్నారు. అయితే తొలి భాగాన్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. సీక్వెల్ ఓటీటీ రైట్స్ ని కూడా సొంతం చేసుకుంది. సమాచారం ప్రకారం 6-7 వారాల తర్వాతే స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. మరి ఈ మూవీ మీలో ఎంతమంది చూశారు? కింద కామెంట్ చేయండి.