మరో క్రేజీ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. 'పొన్నియిన్ సెల్వన్ 2' స్ట్రీమింగ్ డీటైల్స్ బయటకొచ్చేశాయి. దీంతో మూవీ లవర్స్ ప్లాన్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
మూవీ లవర్స్ మరీ కమర్షియల్ అయిపోయారు. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కావడం లేటు. బాగుంటే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి మరీ చూస్తున్నారు. లేదంటే ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. దాదాపు అన్ని సినిమాల విషయంలో ఇదే సూత్రం పాటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిపోయాయి అనగానే వీకెండ్ కి అందుకు తగ్గ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంటారు. తాజాగా ప్రేక్షకుల్ని అలరించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది. అందుకు సంబంధించిన డీటైల్స్ బయటకొచ్చేశాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి ‘బాహుబలి’ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పీరియాడిక్ మూవీస్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అలా తమిళంలో అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతేడాది సెప్టెంబరులో ఫస్ట్ పార్ట్ విడుదలవగా, కొన్నిరోజుల ముందు సీక్వెల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ బాగుందనే టాక్ వచ్చింది. తెలుగులో మాత్రం ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయింది.
థియేటర్ కి వెళ్లి చూడాలంటే కష్టం గానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూడటం మనోళ్లకు పెద్ద విషయమేం కాదు. తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఓటీటీ రిలీజ్ ఫిక్సయింది. మే 26 నుంచి రెంట్ విధానంలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. జూన్ 2వ వారం నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇది దాదాపు కన్ఫర్మ్ అయినప్పటికీ.. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరి ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఓటీటీ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్? కింద కామెంట్ చేయండి.