రోజు రోజుకీ ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, సిరీసుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరికొన్ని భాషల్లో ఈ ఒక్క రోజే దాదాపు 20 చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల వివరాలు.
శుక్రవారం వస్తుందంటే చాలు థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలు, ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవబోయే మూవీస్, వెబ్ సిరీస్‌ల అప్‌డేట్లతో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా ఉంటుంది. పాండమిక్ పుణ్యమా అని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఊహించని క్రేజ్ వచ్చేసింది. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఒరిజినల్స్, సిరీస్‌లతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నారు ఓటీటీ యాజమాన్యం. ఇక సెన్సార్ తలనొప్పి ఉండదు కాబట్టి క్రియేటివిటీకి మితి మీరిన అడల్ట్ కంటెంట్ యాడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు రెండో వారంలోకి ఎంటర్ అవుతున్న ‘ఆదిపురుష్’ హంగామా కాస్త తగ్గింది. ఈ శుక్రవారం (జూన్ 23) ఏకంగా 9 సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కానున్నాయి. అయితే జనాలు వాటి మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు కానీ ఎప్పటిలానే ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు, సిరీస్‌ల కోసమే వెయిట్ చేస్తున్నారు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘టీకూ వెడ్స్ షేరు’, ‘జాన్ విక్ 4’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ లాంటి మూవీస్, పలు సిరీసులు స్ట్రీమింగ్ అవబోతున్నాయి.
తమన్నా రెచ్చిపోయి రచ్చ చేసిన ‘జీ ఖర్దా’ సిరీస్ ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. మిల్కీబ్యూటీ రొమాంటిక్ సన్నివేశాల్లో మతిపోగొట్టేసిందంటూ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ సినిమాలతో ఆకట్టుకున్న మహి వి.రాఘవ్ ‘సైతాన్’ సిరీస్‌తో సాలిడ్ షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ రెండు సిరీసులకు సంబంధించిన డైలాగ్స్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే అంత ఫ్రీ పబ్లిసిటీ అన్న చందాన రికార్డ్ రేంజ్ వ్యూస్ సాధిస్తున్నాయి. రోజు రోజుకీ ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, సిరీసుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరికొన్ని భాషల్లో ఈరోజు (జూన్ 23) ఒక్క రోజే దాదాపు 20 చిత్రాలు సందడి చేయబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల లిస్ట్..
మళ్లీ పెళ్లి – (ఆహా & ప్రైమ్ వీడియో) – తెలుగు సినిమా
ఇంటింటి రామాయణం (ఆహా) – తెలుగు సినిమా
ది కేరళ స్టోరీ – (జీ5) – తెలుగు డబ్బింగ్ మూవీ
ఏజెంట్ – (సోనీ లివ్) – తెలుగు సినిమా
కేరళ క్రైమ్ ఫైల్స్ – (డిస్నీ+హాట్‌స్టార్) – తెలుగు డబ్బింగ్ సిరీస్
జాన్ విక్ 4 -(లయన్స్‌గేట్ ప్లే & ప్రైమ్ వీడియో) – ఇంగ్లీష్ మూవీ
టీకూ వెడ్స్ షేరు – (అమెజాన్ ప్రైమ్) – హిందీ మూవీ
జాన్ లూథర్ – (ఆహా తమిళ్) – మూవీ
కళువెత్తి మూర్కన్ – (అమెజాన్ ప్రైమ్) – తమిళ్ సినిమా
మట్టే మడువే – (అమెజాన్ ప్రైమ్) – కన్నడ మూవీ
కొండ్రాల్ పావమ్ – (అమెజాన్ ప్రైమ్) – తమిళ్ (స్ట్రీమింగ్ అవుతోంది)
ఐ యామ్ ఏ విర్గో – (అమెజాన్ ప్రైమ్) – ఇంగ్లీష్ సిరీస్ – సీజన్ 1
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ – (జీ5) – హిందీ, తెలుగు, తమిళ్
తీర కాదల్ – (నెట్‌ఫ్లిక్స్) – తమిళ్ మూవీ
త్రిశంకు – (నెట్‌ఫ్లిక్స్) – మలయాళం
ది పర్ఫెక్ట్ ఫైండ్ – (నెట్‌ఫ్లిక్స్) – ఇంగ్లీష్
ఐ నంబర్ నంబర్: జోజీ గోల్డ్ – (నెట్‌ఫ్లిక్స్) – ఇంగ్లీష్
త్రూ మై విండో: అక్రాస్ ది సీ – (నెట్‌ఫ్లిక్స్) – స్పానిష్ మూవీ
మేక్ మీ బిలీవ్ – (నెట్‌ఫ్లిక్స్) – టర్కిష్ మూవీ
కింగ్ ఆఫ్ క్లోన్స్ – (నెట్‌ఫ్లిక్స్) – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
బ్లాక్ క్లోవర్ – (నెట్‌ఫ్లిక్స్) – జపనీస్ సిరీస్ -4 (శనివారం నుండి)
క్యాచింగ్ కిల్లర్స్ – (నెట్‌ఫ్లిక్స్) – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్ -3
జాగ్డ్ మైండ్ – (హాట్‌స్టార్) – ఇంగ్లీష్ మూవీ
వరల్డ్స్ బెస్ట్ – (హాట్‌స్టార్) – ఇంగ్లీష్ మూవీ
రెవెనంట్ – (హాట్‌స్టార్) – కొరియన్ సిరీస్ -1
సీక్రెట్ ఇన్వాజన్ – (హాట్‌స్టార్) – (5 భాషలు) – సిరీస్ -1 : ఎపిసోడ్ 1 (స్ట్రీమింగ్ అవుతోంది)
కఫాస్ – (సోనీ లివ్) – హిందీ సిరీస్ -1
అసెక్ – (జియో సినిమా) – హిందీ మూవీ